ఒకవైపు తెలంగాణలోని ఆంధ్రులను రక్షిస్తానని అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే "ఆయనొస్తే.. ఆడపిల్లలకు రక్షణ'' అనే యాడ్ లు ఇంకా జనాల చెవుల్లో మార్మోగుతున్నాయి. ఆయన వచ్చాకా కూడా శాంతిభద్రతల విషయంలో తేడా వచ్చింది ఏమీ లేదు. ఇక ప్రతిపక్ష వాళ్లు అయితే నెత్తి నోరు మోదుకొంటున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి.. మా వాళ్లను చంపేస్తున్నారు అని. మరి ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి కి ఇప్పుడు రక్షణ కల్పిస్తున్నది కూడా ఆంధ్రప్రదేశ్ బలగాలు కాదట! బాబు ప్రస్తుతం కేంద్ర బలగాల రక్షణలో ఉన్నారట! ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తనకు తాను రక్షించుకోవడానికి సరైన బలగాన్ని తయారు చేసుకొనేంత శక్తి కూడా లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు! ఆంధ్రప్రదేశ్ బలగాలపై నమ్మకం లేక.. తన హయాంలో శాంతిభద్రతలు సరిగా ఉండవనే అభిప్రాయంతో ఏపీ సీఎం ఈ విధంగా కేంద్ర బలగాలను తన రక్షణ కోసం వినియోగించుకొంటున్నాడని... వారు గేలి చేస్తున్నారు. మరి బాబు వస్తే.. శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని... ఆయన కు మాత్రమే వాటిని కంట్రోల్ చేయకగ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారని.. అయితే ఇప్పుడు అది కూడా ఉత్తుత్తి మాటేనని... బాబు వచ్చాకా కూడా ప్రజా రక్షణ వ్యవస్థలో గొప్పమార్పులు ఏమీ లేవని వారు అంటున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: