మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. శాసనసభ సమావేశాల తర్వాత విస్తరణ జరగొచ్చంటూ టీఆర్ఎస్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గంలో ఇంకా ఆరుగురికి చోటు కల్పించే వీలుంది. ఇప్పటికే ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. విస్తరణలో ఈ రెండు జిల్లాకు తప్పనిసరిగా చోటు కల్పిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో గిరిజనులకు, మహిళలకు ఇప్పటివరకూ స్థానం లేదు. విస్తరణలో ఆ లోటు భర్తీ చేస్తారట. కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్ కు ఈసారి బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. గిరిజన, మహిళా కోటా కలసి వచ్చేలా.. అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి చోటు దక్కే ఛాన్సుందట. వరంగల్ జిల్లా నుంచి కొండా సురేఖ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. విస్తరణతో పాటు మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేసే అవకాశం కూడా ఉంది. కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శాఖల వారిగా మంత్రుల పనితీరును అంచనా వేస్తున్న కేసీఆర్.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సూచనలు అందుతున్నాయి. మంత్రివర్గంతో పాటు పార్టీని కూడా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసి... కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల తర్వత భారీ మార్పులే ఉంటాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: