తెలంగాణ ప్రభుత్వ చరిత్రలో నిలిచిపోనున్న రోజు నేటి ఆగస్టు 19. సామాజిక, ఆర్థిక, సంక్షేమ, ఆరోగ్య, మౌలిక వసతుల స్థితిగతుల పై నేడు సమగ్ర సర్వే నిర్వహిస్తుండడమే అందుకు కారణం. కేంద్రంతోపాటు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలాంటి సర్వే గతంలో నిర్వహించలేదు. సుమారు కోటి కుటుంబాల సమాచారాన్ని ఒకేరోజు రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సర్వే కోసం లక్షల మంది ఎన్యుమరేటర్లు పని చేస్తున్నారు. అత్యధిక కుటుంబాలు హైదరాబాద్ జిల్లాలో ఉండగా... అతి తక్కువ ఫ్యామిలీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం కుటుంబాల సంఖ్య : 86, 85,000 ప్రస్తుత సర్వే కోసం నమోదైన వాటి సంఖ్య : 99,41,000 సర్వేలో నిర్వహించే ఎన్యుమరేటర్ల సంఖ్య : 3,69, 729 సర్వే కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మొత్తం రూ. : 20,00,00,000 హైదరాబాద్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 20,00,000 నల్గొండ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 10,42,000 వరంగల్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 10,15,000 కరీంనగర్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 9,86,000 మహబూబ్ నగర్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 9,74,000 ఖమ్మం జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 8,77,000 రంగారెడ్డి జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,89,000 మెదక్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,61,000 ఆదిలాబాద్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,47,000 నిజామాబాద్ జిల్లాలోని కుటుంబాల సంఖ్య : 7,05,000 సర్వే పత్రంలోని మొత్తం పేజీల సంఖ్య : 9 సర్వే పత్రంలోని మొత్తం అంశాల సంఖ్య : 101 సర్వే పత్రంలో అందరికీ వర్తించే వాటి సంఖ్య : 18 సర్వేలో ఆధారాలు చూపాల్సిన అంశాల సంఖ్య : 11 నిరంతరాయంగా సర్వే జరిగే సమయం గంటలు : 13

మరింత సమాచారం తెలుసుకోండి: