రాష్ట్రంలోని పలు పట్టణాలను కలుపుతూ సుస్థిర పట్టణ రవాణా పేరుతో మెట్రో కారిడార్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో ఇచ్చిన హామీ మేరకు.... మెట్రో ప్రాజెక్టు విధివిధానాలు, సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. పర్యావరణానికి హాని లేకుండా, తక్కవ ఖర్చులో భవిష్యత్ అభివృద్ధిని దృషిలో పెట్టుకొని దీన్ని నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వీలైనంత వరకు భూగర్భంలో కాకుండా, వెలుపలే వంతెనలు నిర్మించాలన్నది కేంద్రం భావన. ఫలితంగా రోడ్డు విస్తరణ నిర్మాణ వ్యయం... ఇతర సమస్యలు ఉండవని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం-విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి లను కలుపుతూ నిర్మించే ఈ మెట్రో నిర్మాణానికి....కిలో మీటరకు 180 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనావేశారు. ప్రాజెక్టు పనులు మొదలయ్యే నాటికి 10శాతం వ్యయం పెరిగినా కిలోమీటర్ కు దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు కానుంది. 4 కారిడార్లు 303 కిలోమీటర్ల నిడివిలో ఈ నిర్మాణం జరుగుతుందని అంచనా. విశాఖ పట్టణంలో మెట్రోరైలు నిర్మాణంపై ప్రణాళిక రూపుదిద్దుకుంటుండగా కేంద్రం ఈ కారిడార్ రవాణా వ్యవస్థపై ఆలోచిస్తోంది. ప్రాజెక్టు విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. మెట్రో రైలు కాలిడార్ వ్యవస్థను కేంద్రమే నిర్మిస్తుందా.... లేదా రాష్ట్రం కూడా వాటా సొమ్ము ఇవ్వాల్సి ఉంటుందా అనేది తేలనుంది. కేంద్రమే నిర్మించినా దీనిలో రాష్ట్రానికి వాటా మాత్రం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: