రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో నెలకు దాదాపు వంద కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూస్తోంది. అయితే ఈ నష్టాల నుండి ఆర్టీసీని రక్షించడానికి రెండే మార్గాలు ఉన్నాయనిఒకటి ప్రభుత్వం ఆర్టీసీని తన ఆధీనంలోకి తీసుకోవాలని లేదా ప్రైవేట్ సంస్థల హస్తగతం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ అభిప్రాయపడుతోంది. అయితే గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో రిలయన్స్ సంస్థ అవిభాజిత ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీని తమ అధీనంలోకి తీసుకుని రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది.ా కాగ ఇప్పుడు నెలకు 12వేల జీతం తీసుకుంటున్న డ్రైవర్లు, కండక్టర్లకు పాతిక వేల చొప్పున జీతాలు ఇస్తామని రిలయన్స్ సంస్థ పేర్కొంది. అయితే ఆర్టీసీ లోని సీనియర్ ఉద్యోగులు, క్లర్కుల సంగతి మాత్రం రిలయన్స్ ప్రస్తావించలేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ద్రవ్య లోటు నుండి బయటకు తేవాలంటే రిలయన్స్ ను నమ్ముకోవడమే సరైన దారి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: