తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా పూర్తి అయ్యిందన్న సమగ్రసర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలోని వ్యక్తులే తప్పుడు వివరాలు ఇచ్చారా? విజయవంతం అయ్యిందన్న ఈ సర్వేలో కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు వివాదస్పదం అవుతాయా?! ఈ మేరకు కవిత వివరాలు నమోదు చేసిన ఎన్యుమరేటర్లపై కూడా చర్యలు తప్పవా?! సమగ్ర కుటుంబ సర్వేలో నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్ లో ఆమె వివారలను నమోదు చేయించారు. ఆమె అత్తవారింట్లో నివాసం ఉంటున్నట్టుగా పేర్కొన్నారు. అయితే కవిత అక్కడ నివాసం ఉండటం లేదు. ఆమె ఆ ఊరిలోఉండకపోయినా... అక్కడ నివాసం ఉన్నట్టుగా ఎన్యుమరేటర్లు నమోదు చేశారు. మరి ఇది అత్సుత్సాహంతో చేసిన పనో... లేక కేసీఆర్ వియ్యంకులంటే ఉన్న భయంతో చేసిన పనో కానీ.. ఎన్యుమరేటర్లపై చర్యలు తప్పవని తెలుస్తోంది. కవిత అక్కడ నివాసం లేకపోయినా.. ఆమె వివరాలను నమోదు చేయడాన్ని విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన ఇలాంటి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు! మొత్తానికి సర్వే విషయంలో కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఎంపీగా బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదవ్వడం విడ్డూరమనే చెప్పవచ్చు. దీనిపై అధికారులుఅంతిమంగా ఏం తేలుస్తారో చూడాలి! విచిత్రం ఏమిటంటే.. మంత్రుల్లో మంత్రుల మధ్య కూడా విబేధాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరమైన వైరుధ్యాలు కాకుండా... భావస్వారూప్యానికి సంబంధించి వీళ్ల మధ్య విబేదాలు కనిపిస్తున్నాయి. రాజధాని ఎంపిక కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న మంత్రి నారాయణను ఉద్దేశించి డిప్యూటీ సీఎం కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యానాలు ఇలాంటి అభిప్రాయాలకు కారణం అవుతున్నాయి.ఎక్కడి వారు అక్కడ సైలెంట్ గా ఉండాలని బాబు కోరుకొంటున్నారు. అయితే మంత్రులు మాత్రం అలా ఉండటం లేదు. ఇక దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు! ఇలాంటి పరిస్థితిని నిరోధించడానికి బాబు మరో సమన్వయ కమిటీని వేశారట.మరి ఈ సమన్వయం లేదని స్పష్టం అయిన నేపథ్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఏ మేరకు సమన్వయం సాధిస్తుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: