ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వ్యవహారం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి ఇబ్బందులే వస్తున్నాయి. ఎవరి ఇష్టాను సారం వారు మాట్లాడకండి... ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు నాకు సలహాలు ఇవ్వకండి...అని ఆయన అంటున్నారు. ఇది చెప్పడానికి బాబు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. అయితే ఉన్నట్టుండి మంత్రులు బాంబులు పేలుస్తున్నారు! ప్రభుత్వంలో సమన్వయం లేదా? అనే అభిప్రాయం కలగడానికి కారణం అవుతున్నారు. సీమాంధ్రకు నిర్మించాల్సిన నూతన రాజధాని విషయంలో బేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు నాయుడే విజయవాడను ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా చేయాలన్నకోరికతో ఉంటే... ప్రభుత్వం లోని కొంతమంది పెద్దలు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను బహిరంగ పరుస్తున్నారు! బాబు ఆలోచనలోని లోటు పాట్ల గురించి వారు చెబుతున్నారు! దీంతో కొత్త ఇబ్బంది వచ్చి పడుతోంది. వెనుకటికి ఏ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనో... అయితే ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యులు ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేవారు.. ఎవరికి తోచించి వాళ్లు చేసే వాళ్లు! అయితే బాబులాంటి వ్యక్తికి కూడా అడపాదడపా అలాంటి అనుభవాలు తప్పడం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: