మరో రెండు నెలల్లో నిర్భయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. మహిళల భద్రత కోసం ఇన్-బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్(జీపీఆర్‌ఎస్ ఎనేబుల్ ట్రాకింగ్ సిస్టమ్) ఉండడం ఈ స్కూటర్ ప్రత్యేకత. మొబైల్ ఫోన్ల ద్వారా ఈ స్కూటర్‌ను ఒక యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చని మోరెల్లో యమసకి సీఈఓ రజిత్ ఆర్. ఆర్య పేర్కొన్నారు. ఈ స్కూటర్‌కు ఉన్న ఒక బటన్‌ను నొక్కితే, సదరు స్కూటర్ ఎక్కడ ఉన్నదన్న సమాచారాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలుస్తుందని, ప్రతీ 2/3 నిమిషాలకు ఈ సమాచారం ట్రాన్స్‌మిట్ అవుతుందని వివరించారు. ఈ స్కూటర్ ధర రూ.35,000 ఉండొచ్చని, మహిళా కొనుగోలుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వాలని యోచిస్తున్నామని వివరించారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిమీ. అని, దీనికి డ్రైవింగ్ లెసైన్స్ అవసరం లేదని వివరించారు. త్వరలో హైస్పీడ్ స్కూటర్లు ఈ తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరో రెండు నెలల్లో మార్కెట్లోకి తెస్తామని రజిత్ ఆర్. ఆర్య వెల్లడించారు. ముంబైకు చెందిన ఆర్య గ్రూప్, జపాన్‌కు చెందిన యమసకి మోటార్స్ కలసి మోరెల్లో యమసకి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. తక్కువ వేగంతో నడిచే మూడు స్కూటర్లను ప్రస్తుతం ఈ కంపెనీ విక్రయిస్తోంది. త్వరలో హై-స్పీడ్ స్కూటర్లనందిస్తామని ఆర్య వివరించారు. జిపిఆర్ఎస్, ఇ-స్కూటర్, నిర్భయ, మోరెల్లో యమసాకి, Gprs, E-scooter, Nirbhaya, Morello Yamasaki

మరింత సమాచారం తెలుసుకోండి: