రుణమాఫీ పథకానికి అంటూ ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే పెద్ద గారడీ. లక్షల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే వ్యవహారానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే విడ్డూరమైన విషయం. మరి అంతే కాదు ... ఇది తాత్కాలిక బడ్జెట్ అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా ఎన్నో గారడీలు చేశారు! ఏ ప్రభుత్వమైనా వార్షిక బడ్జెట్ ను ప్రకటిస్తుంది కానీ.. బాబు ప్రభుత్వం విచిత్రంగా తాత్కాలిక బడ్జెట్ ను ప్రకటించింది. మరి ఈ సంగతి ఇలా ఉంటే... ఉన్నఫలంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు దాటడంలో కూడా చాలా గారడీలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే బడ్జెట్ మొత్తం లక్ష కోట్ల రూపాయల చిల్లర ఉండేది. మరి విభజన జరిగాక కూడా ఈ స్థాయికి ఎలా చేరింది? అంటే... ఇక్కడే బాబు గారడీ కనిపిస్తుంది. ఉదాహరణకు... కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రెండు రకాల నిధులొస్తాయి. రాష్ట్రం వాటా కింద రావాల్సిన నిధులు కొన్ని అయితే, గ్రాంటు కింద వచ్చేవి రెండో తర హావి. ఇలాంటి గ్రాంటుల్లో ఉమ్మడి రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చాయి. ఇవికాక పన్నుల నుంచి ఉమ్మడి రాష్ట్రం వాటాగా వచ్చినవి మరో రూ. 12,000 కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు రాష్ట్రం విభజనకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 15 వేల కోట్ల రూపాయలు వస్తే ఇప్పుడు ఎంత రావాలి? తక్కువే కదా! కానీ బాబు బడ్జెట్ లొ మాత్రం విభజిత రాష్ట్రానికే గ్రాంటు ఆన్ ఎయిడ్ కిద రూ. 29 వేల కోట్లు వస్తాయని చూపించారు! మరి ఇది విని ఆశ్చర్యపోతారో ఏం చేస్తారో జనాల ఇష్టం. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిందే 15 వేల కోట్ల రూపాయలు అంటే.. సీమాంధ్ర సహిత ఆంధ్ర ప్రదేశ్ కే 29 వేల కోట్ల రూపాయలు వస్తాయని ఇప్పుడంటున్నారు. ఇలాంటి గారడీలు ఎన్నో చేస్తే కానీ ఏ పీ బడ్జెట్ లక్ష కోట్ల మొత్తం చేరలేదు! చాలానే కష్టపడ్డారు పాపం!

మరింత సమాచారం తెలుసుకోండి: