సమగ్ర సర్వే సందర్భగా వచ్చిన అధికార్లు ప్రజలకు అడిగిన పలు ప్రశ్నలు జనంలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు సర్వేలో ఉంటాయని ముందే తెలసినా ప్రజలు సర్వే తరువాత మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ సర్వేలో వచ్చిన సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయనున్నట్లు మీడియాలో కథనాలు రావడంతో తెలంగాణలోని జనంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో తమ ప్రభుత్వం వస్తుందని భావించిన తాము సైతం ఈ సర్వేతో ఆందోళన చెందుతున్నామని తెలంగాణ వాసులు సైతం తమ గోడును వెలబోసుకొంటన్నారు. సర్వే సందర్భంగా మీ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయి, ఆవి ఏవేవి ఎన్ని వాహనాలు ఉన్నాయి, వాటి రిజిస్ట్రేషన్‌నెం(ఆర్‌సి నెం)తో సహా సర్వేలో పొందుపరిచారు. ఇక్కడ సర్వేపై జనంలో భయాందోళనలు నెలకొన్నాయి. సొంత ద్విచక్రవాహనం ఉంటే భవిష్యత్తులో తమకు సంక్షేమ పథకాలు అందుతాయా, రేషన్‌ కార్డులు రద్దు అవుతాయా, ఫించన్ల సంగతి ఏమిటి ఇలాంటి సందేహాలు వారిలో మొదలయ్యాయి. మొత్తం వివరాలు చెప్పడం వల్ల ఇండ్ల పన్నులు, భూముల పన్నులు పెరుగుతాయా అన్న ఆందోళన వారిలో కొనసాగుతోంది. నిరూపేద కుటుంబం కూడా ప్రస్తుతం వేగంగా పయనిస్తున్న ఈ ప్రపంచంలో ద్విచక్ర మోటార్‌ సైకిల్‌ కలిగి ఉండటం పరిపాటి. కానీ ఇదే సాకుగా చూపి తమను ఎక్కడ పేదరిక జాబితా నుంచి తొలగిస్తారోన్నన్న ఆందోళన సర్వేలో సమాచారం ఇచ్చిన ప్రజానికంలో నెలకొంది. మున్ముందు స్వయం ఆర్థిక పథకాలకు దరఖాస్తు చేసుకొంటే ఇప్పటికే సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడ టి సర్కార్‌ దూరం చేస్తుందోనని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఇక పశుసంపద వివరాలపై కూడా వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పశు సంపద ఎప్పుడు నిలకడగా ఉండదు. వాతావరణంలో వచ్చిన మార్పులతో పశువులు తరచూ మరణాలకు గురవుతున్న ఘటనలు సహజంగానే జరుగుతుంటారు. ఈ పశుసంపదను ఆదాయ వనరుగా పరిగణించి మున్ముందు తమకు అందే ప్రభుత్వ ప్రతిఫలాలను టి సర్కార్‌ ఎక్కడ దూరం చేస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఈ సర్వేలో పేర్లు నమోదు చేసుకొని ప్రముఖలపై కెసిఆర్‌ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడ(హైదరాబాద్‌)లో ఉండదల్చుకోలేదేమో అందుకే సర్వేలో తన పేరు నమోదు చేయించుకోలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యనించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో కర్నాటక, మహారాష్ట్ర, బీహార తదితర రాష్టాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న సెటిలర్లలోనూ ఆందోళన కొనసాగుతోంది. ఈ సమాచారంతో హైదరాబాద్‌ నుంచి తమను తరిమేస్తారా అని పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్వే నేపథ్యంలో తెలంగాణ ప్రజానికంలో నెలకొన్న అనుమానాలు, అపోహలను టిఆర్‌ఎస్‌ సర్కారే దూరం చేయాల్సిన ఆవశ్యత ఉందని మేధావులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: