జగన్..ముందు బడ్జెట్ అంటే ఏమిటో తెలుసుకో.. అని అన్నాడు తెలుగుదేశాధినేత.. బాబుగారు ఈ పంచ్ వేయగానే తెలుగుదేశం వాళ్లు అయితే బల్లలు చరిచి పగలబడి నవ్వారు కానీ... బయట అయితే పంచ్ అంత గా పేలలేదని చెప్పవచ్చు. తెలుగుదేశాధినేత వైకాపా అధినేతకు చురకా వేశాడని అనుకూల మీడియాలో అయితే వచ్చిందేమో కానీ... జగన్ ను తక్కువ చేసి మాట్లాడటం, జగన్ కు అవగాహన లేదని అనడం మాత్రం సూట్ కాలేదు. జగన్ కు అనుభవం లేదని బాబు చెప్పదలుచుకోవడం హాస్యాస్పదంగా మారింది. మరి అనుభవం లేని జగన్ తోనే కదా.. చంద్రబాబు మొన్నటి వరకూ పోరాడాడు. ఇప్పుడు కూడా పోరాడుతున్నాడు. అనుభవంలేని జగనే కదా.. ఎన్నికల సమయంలో బాబుకు మచ్చెమటలు పట్టించాడు. అనుభవం లేని , బడ్జెట్ అంటే ఏమిటో కూడా తెలియని జగన్ తో పోరాడటానికే కదా.. చంద్రబాబు బీజేపీ వాళ్లను, పవన్ కల్యాన్ ను కలుపుకొని పోయాడు. అనుభవంలేని జగన్ పెట్టిన పార్టీనే కదా.. తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో పోటీని ఇచ్చింది. అనుభవం లేని జగన్ ఆధ్వర్యంలోని పార్టీనే కదా.. ఒక దశలో గెలుస్తుందేమో అని అనిపించింది. మరి ఇప్పుడేమో తెలుగుదేశాధినేత జగన్ ను చాలా తేలికగా తీసిపడేస్తున్నాడు.. ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ.. బాబు గారు మరీ సుపీరియారిటీ కాంప్లెక్స్ కు చేరిపోయినట్టుగా ఉన్నారు. మరి బాబు బడ్జెట్ గురించి జగన్ కు అవగాహన లేకపోవచ్చేమో కానీ... అందులోని గారడీలు అయితే చాలా స్పష్టంగా జనాలకు అర్థం అవుతున్నాయి. అలాంటి లోటు పాట్లను బాబు సర్దుకోవాల్సి ఉంటుంది. అంత వరకూ ఇలాంటి చురకలతో సాధించేదేమీ ఉండదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: