కేంద్రమంత్రి హోదాలో ని చిరంజీవికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని ఆయన ఇప్పటి వరకూ ఖాళీ చేయలేదు అనేది ఒక ప్రధానమైన అభియోగం. తన పార్టీ అధికారం కోల్పోయినా.. తను మాజీ మంత్రిగా మారిపోయినా మెగాస్టార్ ప్రభుత్వ అధికారిక నివాసాన్ని మాత్రం అట్టే పెట్టుకొన్నాడు. ఇది విమర్శలకు దారి తీస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తూ చిరంజీవి లాంటి వ్యక్తి ఇంటి కోసం కక్కుర్తి పడటం ఏమిటి? అనే తీవ్రమైన వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయిప్పుడు. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకూ అధికారిక నివాసాలను ఖాళీ చేయలేదట. వారందరిపై విమర్శలు రావడం ఒక ఎత్తు అయితే.. మెగాస్టార్ గా పేరున్న చిరంజీవిపై కూడా అలాంటి విమర్శలే రావడం మరో ఎత్తు. అయితే వీటికి సంబంధించి సరికొత్త అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. మెగాస్టార్ ఢిల్లీలో నివాసం ఉన్న ఇంటికి వాస్తు దోషాలున్నాయని సమాచారం. ఈ విషయాన్ని తేల్చింది ఎవరో కాదు... కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పంపిన వాస్తు విద్వాన్ లు ఈ విషయాన్ని నిర్ధారించరట. మరి మెగాస్టార్ ఇంటి వాస్తు గురించి రాజ్ నాథ్ సింగ్ ఎందుకు పరిశీలించపజేశాడు.. అంటే, చిరంజీవి ఇంటిని కాళీ చేస్తే.. అక్బర్ రోడ్డులోని అందులోకి రాజ్ నాథ్ సింగ్ చేరాల్సి ఉంది. అయితే చిరంజీవి ఎంతకూ కదలడం లేదు. ఈ లోపే రాజ్ నాథ్ సింగ్ ఆఇంటి వాస్తు గురించి అధ్యయనం చేయించాడట. ఈ నేపథ్యంలో ఇంటి టి గురించి వాస్తు విద్వాన్ లు పెదవి విరిచారట. ఆ ఇంటిలో చేరకపోవడం మంచిది.. అని రాజ్ నాథ్ కు సూచించారట. దీంతో రాజ్ నాథ్ సింగ్ ఆలోచనలో పడిపోయారట. చిరంజీవి ఇంటిని ఖాళీ చేసినా.. ఇప్పుడు ఆ నివాసంలోకి ప్రవేశించే ఉత్సాహం లేదట రాజ్ నాథ్ సింగ్ కి. మరి చిరంజీవి మంత్రి కాకపోయినా.. ఇకపై కూడా హ్యాపీగా ఆ ఇంటిలోనే ఉండవచ్చని తెలుస్తోంది. మరి వాస్తు దోషం ఉన్న ఇంటిలో మెగాస్టార్ అయిన కొనసాగుతాడా?!

మరింత సమాచారం తెలుసుకోండి: