పవన్ పై జనాలు ఆశలు ఒక విధంగా ఉంటే... ఆయన తీరు మాత్రం మరో విధంగా ఉంది... ప్రశ్నిస్తాను అని పవన్ అంటే... అది జనాల సమస్యల గురించి , ప్రభుత్వ వ్యవహారాల గురించి అని అందరూ అనుకొంటున్నారు. అయితే పవన్ మాత్రం కేవలం తన వ్యక్తిగత స్పర్థల గురించి , వ్యక్తిగత వైరుధ్యాల గురించి మాత్రమే ప్రశ్నిస్తాడు.. అని ప్రస్తుతానికి ాయనకున్న ోపిక అంతే నని స్పష్టం అవుతోందిప్పుడు. చానాళ్ల తర్వాత పవన్ మీడియా ముందుకు వచ్చాడు. బీజేపీ జాతీయాధ్యఓుడు హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో పవన్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ మధ్య మెదక్ జిల్లాల్లో రైలు ప్రమాద బాధితులైన చిన్నారులను పరామర్శించడానికి వచ్చినప్పుడు కనిపించిన పవన్ ఇప్పుడు మళ్లీ కనిపించాడు. అది కూడా పిల్లలు హైదరాబాద్ లోని హాస్పిటల్ లో ఉన్నారు కాబట్టి.. పవన్ పరామర్శించి వెళ్లాడు. వారుగానీ గ్రామీణ ఆసుపత్రలుల్లోచికిత్స పొందుతూ ఉండుంటే పవన్ అక్కడికి వెళ్లేవాడో కాదో మరి. ఆ సంగతి అలా ఉంటే.. ఆరు నెలల కరాటే ప్రాక్టీస్ చేసి మూలనున్న ముసలమ్మతో పోరాడినట్టుగా... పవన్ ఇన్ని రోజుల పాటు మీడియాకు దూరంగా ఉండి... ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి..మళ్లీ కేసీార్ ను మాత్రమే విమర్శించడం .. అది కూడా సర్వే గురించి తనపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తను ఎందుకు సర్వేలో పాల్గొనలేదో పవన్ వివరణ ఇచ్చాడు. తనను విమర్శించిన టీఆర్ఎస్ వాళ్లకుసూక్తులు చెప్పి వెళ్లాడు! వాళ్లపై ప్రతి విమర్శలు చేశాడు. మరి పవన్ కు తెలిసిన ప్రశ్నించడం, రాజకీయం ఇదేనేమో! అవతల రైతులు, డ్వాక్రామహిళలు, విద్యార్థులు ప్రభుత్వాల తీరుతోఅనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర తేడా లేకుండా ఇలాంటి పరిస్థితులున్నాయి. మరి పవన్ ఈ అంశాల గురించి మాట్లాడకుండా... సర్వేలో పాల్గొనకపోవడం ద్వారా తను రెబల్ అయినట్టుగా.. అదేదో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడినట్టుగా మాట్లాడాడు... అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి పవన్ అదే గొప్ప అనుకొంటున్నాడేమోలేండి!

మరింత సమాచారం తెలుసుకోండి: