శాసన సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఊగిపోయారు. టీడీపీ సభ్యులు తనపై చేసిన ఆరోపణలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జగన్ ఆవేశంతో మట్లడుతూ మీలాంటి బఫూన్‌లతో మాటలు అనిపించుకుంటుంటే నాకెలా ఉంటుందంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర కలకలం చెలరేగింది. మంగలికృష్ణ విపక్ష నేత జగన్‌కు తెలియదా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. దీంతో సంయమనం కోల్పోయిన జగన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. తమను బఫూన్లంటూ వ్యాఖ్యానించడంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్ద ఆందోళన చెపట్టారు. దీంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది. అంతకుముందు జగన్ మాట్లాడుతూ మనిషిని ఖూనీ చేసే స్థాయికి రాజకీయవ్యవస్థ దిగజారిందన్నారు. చనిపోయిన వ్యక్తులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాత్రమే తాము కోరామని దానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. వైయస్‌కు ప్రాణాలు పోయడమే తెలుసు అసెంబ్లీలో చర్చలో టీడీపీ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై హత్యలు ఇకపై కూడా కొనసాగుతాఏమోనని అనిపిస్తోందని కొడాలి నాని అన్నారు. దురుద్ధేశంతోనే పరిటాల రవి హత్యకేసులో జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వృత్తిరీత్యా డాక్టర్ అని, ఆయన ప్రాణాలు పోయడమే తెలుసు కానీ, తీయడం తెలియదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: