రైతుల రుణాల మాఫీ వ్యవహారం చిక్కుముడిగానే ఉంది.పాత బకాయిల చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తాబమని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయని మీడియాలో ప్రముఖంగా కధనం వచ్చింది.రుణమాఫీకి ఒప్పుకోవడం లేదంటూ బ్యాంకులను నిందిస్తూ సంపాదకీయాలు రాసిన మీడదియాలోనే ఈ కధనం రావడం గమనించదగ్గ అంశమే.ఆంద్రప్రదేశ్,తెలంగాణ ప్రభుత్వాలు రుణ మాఫీకి అర్హులైన వారి జాబితా సిద్దం చేయడానికే ఉత్తర్వులు ఇచ్చాయని, ఖాతాలలో డబ్బు జమ చేయడానికి కాదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కనుక డబ్బు ఇస్తే వారి ఖాతాలోనే జమ చేస్తామని బ్యాంకులు అంటున్నాయి.అంటే దీనర్ధం రైతులు తమ బాకీలు తాము చెల్లించండని చెప్పడమే అవుతుంది.ముందుగా రైతులు తమ రుణాలు చెల్లిస్తారా?రైతులు అలా చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మెల్లగా వీలును బట్టి ప్రభుత్వం భర్తీ చేయవచ్చు.కాకపోతే రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు విలువ ఉండదన్న సంగతి ప్రజలు భావించే అవకాశం ఉంటుంది.మరి రైతులు ఏమి చేయాలో?

మరింత సమాచారం తెలుసుకోండి: