సాక్షి పత్రిక అంటే వైఎస్ జగన్ పార్టీ కరపత్రం లాంటిదేనన్న సంగతి అందరికీ తెలుసు. దీనిపై రాష్ట్రంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండే అవకాశం లేదు. అందులోనూ సాక్షి పత్రిక స్థాపించింది.. ఆ తర్వాత కొన్నాళ్లు ఛైర్మన్ గా ఉన్నది కూడా సాక్షాత్తూ జగనే. ప్రస్తుతం ఆయన సతీమణి భారతి ఈ పత్రిక ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతటి బ్యాక్ డ్రాప్ ఉన్నా.. జగన్ శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు. సాక్షి పత్రికలోనూ తప్పులు రావచ్చన్నారు. అంతేకాదు.. ఓ దశలో చిరాకొచ్చి.. సాక్షి పత్రికతో నాకేంటి సంబంధం అంటూ విలేఖర్లపై చిర్రుబుర్రులాడారట. అసలీ టాపిక్ ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేను బఫూన్లంటూ తీవ్రంగా మండిపడిన జగన్... ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నించారు. సెల్ఫ్ గోల్ అయ్యామా అన్న సందిగ్దంలో ఉన్న ఆయన లాబీల్లో విలేఖరులకు వివరణ ఇచ్చేప్రయత్నం చేశారు. తాను బఫూన్లనే పదం ఎందుకు వాడానో వివరణ ఇచ్చారు. తనను హంతకులు, స్మగ్లర్ వంటి తీవ్రపదజాలంతో విమర్సించినందువల్లే తాను ఆ మాటలు అనాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే విలేఖర్లు కొందరు రాజకీయ హత్యల సంఖ్యపై అనుమానాలు వెలిబుచ్చారు. రాజకీయ హత్యలు మొదట 19 అన్నారుగా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. అబ్బే కాదు.. పదకొండే.. నిజాలు తెలుసుకోవాలంటే సాక్షిపత్రిక చదవండి అంటూ జగన్ ఓ ఉచిత సలహా పడేశారు. మీడియా వాళ్లు ఊరుకుంటారా.. అయ్యా జగన్ బాబు.. మీ సాక్షి పత్రికలోనే 19 మంది అంటూ రాశారని గుర్తు చేశారు. దీంతో కంగుతిన్న జగన్.. అలా రాశారా.. అయితే సాక్షిలో మాత్రం తప్పులు రాకూడదా.. అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్లకు అందిన సమాచారం బట్టి సాక్షి వాళ్లు రాసి ఉంటారని అన్నారు. అంతటితో ఆగకుండా.. అయినా సాక్షి పత్రికకూ నాకూ ఏమిటి సంబంధం అని కూడా ప్రశ్నించారట. జగన్ దబాయింపుతో మీడియా ప్రతినిధుల నోళ్లు మూతబడ్డాయట. మరీ ఇంత అడ్డగోలుగా వాదిస్తే.. ఇక చేసేదేముందంటూ సైలంట్ అయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: