ప్రభుత్వ సంక్షేమ పథకాలను అక్రమంగా వినియోగించుకుంటున్నవారిని ఆధార్ కార్డుల ద్వారా ఏరివేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. పెన్షన్, రేషన్, ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, గ్యాస్ పంపిణీ తదితర పథకాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: