తెలుగుదేశం పార్టీ వాళ్లందరినీ బఫూన్లు అనేశాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీలో సహనం కోల్పోయినట్టుగా మాట్లాడుతూనే జగన్ అలా అన్నప్పటికీ... ఇప్పుడు బఫూన్ అనే మాట హాట్ టాపిక్ గా మారింది. సరదా చర్చ అవుతోంది. తనను అన్ని మాటలు అన్న వారిని తను బఫూన్ అని అంటే తప్పేమిటని జగన్ అంటుండే సరికి తెలుగుదేశం ఇరకాటంలో పడిపోయింది. కావాలంటే తనను అన్నమాటలను ఉపసంహరించుకోండి.. నేను కూడా ఆ పదాన్ని ఉపసంహరించుకొంటున్నా.. అనే బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు జగన్. దీంతో టీడీపీ వాళ్లు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో జగన్ పై విమర్శలు చేయడానికి మాత్రం తెలుగుదేశం వెనుకాడటం లేదు. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ విషయంలో స్పందించాడు. జగన్ అందరినీ బఫూన్లు అని అనడం కరెక్ట్ కాదు అని యనమల అంటున్నాడు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వాళ్లను... అభ్యంతరకమైన పదాలను వాడిన వాళ్లను కావాలంటే జగన్ బఫూన్లు అని అనుకోవచ్చు.. అన్నట్టుగా ఉన్నాయి యనమల మాటలు! తెలుగుదేశం వాళ్లందరినీ జగన్ బఫూన్లు అనకూడదని, వ్యక్తిగతంగా కొంతమందిని అనుకోవచ్చన్నట్టుగా యనమల మాట్లాడాడు! మరి టీడీపీలో అందరినీ బఫూన్లు అనడాన్ని మాత్రం తప్పుపడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ విషయంపై జగన్ వివరణ ఇస్తాడా? ఎవరు బఫూన్లో చెబుతాడా?!

మరింత సమాచారం తెలుసుకోండి: