కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటన ఆంద్రప్రదేశ్ కు కొంత ఇబ్బంది కలిగించేదే అవుతుందేమో! కేంద్ర ఆర్ధిక సాయం అంటే నగదు బదిలీ కాదని,అవసరమైన ప్రాజెక్టులకు సాయం చేస్తామని ఆయన చెబుతున్నారు.ఆంద్ర ప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలపై ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనకు కట్టుబడి కేంద్రం సాయం చేస్తుందని ఆయన అన్నారు. అయితే ఇది నగదుగా డబ్బు వస్తుందని కొందరు భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆయా స్కీములను ప్రతిపాదిస్తే,వాటికి అవసరమైన మేర ఆర్ధిక సాయం చేస్తామని జైట్లి తెలిపారు.కేంద్రం నుంచి రాష్ట్రప్రభుత్వం భారీగా ఆర్ధిక సాయం ఆశిస్తోంది. బడ్జెట్ కు ముందు ఏకంగా డెబ్బై వేల కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి పంపినా, కేంద్రం వాటిని సీరియస్ గా తీసుకోలేదు. పైగా విభజన చట్టంలోని ప్రతిపాదనలు అంటే, వాటికి సంబందించి వివిధ పనులను కేంద్రానికి పంపి, అక్కడ ఆమోదం పొంది ఆర్ధిక సాయం తీసుకోవాలి. అవన్ని జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.అయితే బడ్జెట్ లోటు పేరుతో, కేంద్రం సాయ పేరుతో ఎపి సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల నిధులను ఆశిస్తోంది. మరి వాటి సంగతి అయినా జైట్లి తేల్చుతారా?

మరింత సమాచారం తెలుసుకోండి: