మోడీ పాలనపై విరుచుకుపడ్డారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. మూడు నెలల పాలన అసంపూర్ణంగా ఉందని మండిపడ్డారు. ఎన్నికల టైంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదన్నరు మాయావతి. కాంగ్రెస్ సీఎంలను వేదించడం సరికాదని, అలాంటి వ్యవహరాలతో ఫెడరల్ స్ట్రక్చర్ కు భంగం కల్గుతోందన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న మత ఘర్షణలకు బీజేపీ ప్రభుత్వమే కారణమని, తాజాగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలతో ఘర్షణలు మరింత పెరిగాయన్నారు. భారతదేశం హిందూ దేశమని మోహన్ భగత్ చేసిన కామెంట్లపై మమావతి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ను బీజేపీనే ముందుకు నడిపిస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల ముందు ముందు దేశంలో సమస్యలు పెరుగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరాలు పెరుగుతాయన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తోందన్నారు మాయావతి. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. నిరుద్యోగ సమస్యకు రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి మోడీ ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: