జమ్మూ కాశ్మీర్‌లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎత్తులు వేస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆ రాష్ట్రంలో పర్యటించి వచ్చారు. ఆదివారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వెళ్ళనున్నారు. 87 స్థానాలున్న అసెంబ్లిdలో 44 కంటే ఎక్కువగా సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఇందుకోసం ఆయనో ప్రణాళికను కూడా రచించారు. ప్రధాని నరేంద్రమోడీకి కుడిభుజంగా పేరుపడ్డ షా ప్రస్తుతానికి 'నమో' ప్రభంజనాన్ని ఉపయోగించుకుని జెఅండ్‌కేలో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అన్ని సీట్లలో మేము పోటీచేయబోతున్నామంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి అశోక్‌ ఖజూరియా ప్రకటించారు. అత్యధికంగా పార్టీ అభ్యర్థులేననీ, కొందరు తమ మద్దతుతో వేర్వేరు గుర్తులతో పోటీ చేస్తారనీ వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ ఆలోచనని చెప్పారు. 1996లో తమ పార్టీకి రాష్ట్రంలో ఎనిమిది సీట్లు వచ్చాయనీ, 12.62శాతం ఓట్లు పొందగలిగామనీ వివరించారు. 2002లో వివాదాస్పదమైన ఎన్నికలు, దీర్ఘకాలం కొనసాగిన గవర్నర్‌ పాలన అనంతరం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. 2002 ఎన్నికలలో ఎనిమిదిశాతం ఓట్లను సాధించినప్పటికీ బీజేపీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అమర్నాథ్‌ వివాదాన్ని సమర్థంగా వినియోగించుకుని సభలో తన సీట్లను 11కు పెంచుకోగలిగింది. కిందటి లోక్‌ సభ ఎన్నికలలో అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి జమ్మూలో రెండు, లడఖ్‌లో ఒకటి స్థానాలను గెలుచుకుంది. దీనిని సావకాశంగా మలుచుకుని అసెంబ్లిలో పాగా వేసి చరిత్ర సృష్టించాలని భావి స్తోంది. కానీ ఇది సాధ్యమేనా అని శ్రీనగర్‌ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాలలో ఓటర్ల సం ఖ్యను బట్టి చూస్తే.. బీజేపీ కనీసం ఆధిక్యత స్థాయికి చేరు కుంటుందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఉన్న 87 సీట్లలోనూ 21 స్థానాలలో హిందూ ఆధిక్యతగా ఎక్కువగా కనిపిస్తుంది. రెండు ప్రాంతాలలో బౌద్ధులు ప్రభావం చూపుతారు. యూపీలో పాటించిన పద్ధతినే ఇక్కడ కూడా అమలుచేసి ఫలితం పొందాలని బీజేపీ ఆశిస్తోంది. సెక్యులర్‌ పార్టీలుగా ముద్రపడ్డ ఎన్‌.సి., కాంగ్రెస్‌, పీడీపీల నుంచి ముస్లిం మెజారిటీ ఓటును చీల్చి, చిన్న చిన్న అనుబంధ సంస్థలను ఏర్పాటుచేసుకోవాలని అమిత్‌ షా భావిస్తున్నారు. వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ అంశాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా హిందూ ఓట్లను సంఘటితం చేసి లబ్ధిపొందాలనేది ఆయన వ్యూహం. జమ్మూలోని 37 స్థానాలలో 16 సీట్లలో ముస్లింఆధిక్యం ఉంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, పిడీపీ మధ్య చతురతతో కూడిన అవగాహన కుదరకపోతే వారి ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయిలో చర్చలను రద్దు చేయడం వెనుక దౌత్యపరమైన అంశం కంటే ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనే ఎక్కువ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకురాలు రేఖా చౌధురి అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్‌పై తన విధానాన్ని ప్రధాని మోడీ ఇంతవరకూ వెల్లడించనప్పటికీ, బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆమె అంటు న్నారు. జమ్మూ, లడఖ్‌ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్న మోడీ కాశ్మీర్‌ను దాటవేయడం బట్టి ఈ అభిప్రాయానికి రావలసి వచ్చిందన్నారు. ప్రధాని అయిన తరవాత మోడీ జమ్మూ, లడఖ్‌లను సంద ర్శించారు. ఈ రెండు పర్యటనలలోనూ ఆయన కాశ్మీ ర్‌ గురించి ప్రస్తావించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా ఆమె పేర్కొంటున్నారు. వేర్పాటు వాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును బీజేపీ ఎంత సమర్థంగా వినియోగించు కుంటుందన్నదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. కాశ్మీరులోని ఎనిమిది నియోజకవర్గాలలో అత్యధి కంగా ఓట్లు పోలైన అంశాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకుంటోంది. మొత్తంమీద చూస్తే ఈ నియోజకవర్గాలలో కాశ్మీరీ పండింట్ల ఓట్ల ను పరిగణనలోకి తీసుకుంటే ఇది అత్యల్పంగా తేలింది. ప్రస్తుతం కాశ్మీరీ పండిట్లు దేశమంతా తిరుగుతూ కొత్త ఒట్లను నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: