తెలంగాణ భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావు శనివారం రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తగ్గించైనా రైతులకు 7గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కరువును ఎదుర్కొనేందుకు గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక తీవ్రమైన కరువు దృష్ట్యా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచే విధంగా కేంద్రానికి లేఖ రాయాలని హరీష్ రావు సమావేశంలో నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: