తెలుగుదేశం పార్టీ వాళ్ల వాదన భలే ఉంటోంది. అధికారంలోకి వచ్చాకా వాళ్లు ఎలా తయారయ్యారంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నా. ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు అన్నా వీళ్లకు మరీ చీప్ అయ్యారు. చీప్ కావడమే కాదు.. వైకాపాకు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వాళ్లు రౌడీలు, దుర్మార్గులు, దుష్టులుగా వీళ్లు వ్యవహరిస్తున్నారు. తమను జగన్ బఫూన్ అని అన్నాడని.. ఈ లెక్కన మాకు ఓటేసిన ప్రజలను జగన్ అవమానించాడని.... తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే సూత్రాన్ని తెలుగుదేశం నేతలుఅంటున్న మాటలకు కూడా అనువర్తింపజేస్తే.. వైకాపాకు ఓటేసిన ప్రజలను అవమనించినట్టే అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు రేపటి నుంచి అసెంబ్లీలోకి బాంబులు తెచ్చి వేస్తారేమో.. అని అంటునన్నారు తెలుగుదేశం నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా గెలిచి, ప్రజాస్వామ్య ఆలయం అఅయిన అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను అనాల్సిన మాటలా ఇవి? ప్రజలు అంత మూర్ఖులా? బాంబులు వేసే వాళ్లను అసెంబ్లీకి పంపించేంత దుష్టులా ప్రజలు?! అయితే తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. జగన్ పై ఒక ఫ్యాక్షనిస్లు ముద్ర వేయాలి.. అవినీతి పరుడని అనాలి.. అలాంటి ముద్ర వేసేస్తే... తర్వాత అది శాశ్వతం అయిపోతుంది.. అందుకు శాయశక్తులా ఇప్పుడు ప్రయత్నాలు చేయాలి.. అని తెలుగుదేశం వాళ్లు భావిస్తున్నారు. అలా ముందుకు పోతున్నారు. మరి ఈ ప్రయత్నంలో వారు విజయవంతం అవుతారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: