తెలుగుదేశం అధ్యక్షుడు గత మూడు నాలుగేళ్లుగా కొన్ని మాటలు చెబుతూ ఉంటారు.. తన హయాంలో అంత మంచే జరిగింది, జరుగుతుంది. వైఎస్ హయాంలో పారిశ్రామిక వేత్తలు జైలు పాలయ్యారు. అధికారులు స్కాముల్లో సూత్రాధారులు అయ్యారు. నా హయాంలో మాత్రం అలాంటి పరిస్థితులు ఏమీ లేవు.. అని ఆయన అంటుంటారు. అయితే ఆ మాటలకు విరుద్ధంగా సంఘటనలు జరుగుతున్నాయిప్పుడు. తెలుగుదేశం అధినేత సీమంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో... రాజధాని నిర్మాణం కోసం వేసిన కమిటీలోని ఒక వ్యక్తిని ఇప్పుడు సెబీ బుక్ చేసింది. బాబు కలల పంట అయిన మరో సింగపూర్ అని చెప్పబడుతున్న రాజధాని నిర్మాణం కోసం వేసిన కమిటీలోని ఒక వ్యక్తి సీబీఐ చార్జిషీట్ లో చేర్చబడ్డాడు. ఆయన ఎవరో కాదు చింతలపాటి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీనిరాజు. సత్యం స్కామ్ లో నమోదైన తాజా చార్జిషీట్ లో శ్రీనిరాజు తో పాటుమొత్తం 13 మంది ఉన్నారు. మరి ఇదే శ్రీనిరాజు రాజధాని కమిటీలో ప్రముఖ సభ్యుడిగా ఉన్నాడు. దీంతో ఈ కమిటీని ఏర్పాటు లోని బాబుగారి చాతుర్యంపై కొత్త మరక ఏర్పడింది. రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ లో భాగస్వామి అయిన వ్యక్తికి రాజధాని కమిటీలో ఎలా స్థానం కల్పించారు? అనే ప్రశ్న ఎదురవుతోంది! మరి తమ చుట్టూ ఉన్నవాళ్లు.. తనకు సన్నిహితులయ్యేవాళ్లు.. తను గౌరవప్రదమైన స్థానంలో నిలిపేవాళ్లు... అంతా నిజాయితీపరులు అని చెప్పుకోవడంలో తెలుగుదేశం అధినేత ముందుంటారు. మరి ఇప్పుడు రాజధాని కమిటీ వ్యవహారంలోని వ్యక్తిపై వచ్చిన అభియోగాల విషయంలో ఆయన ఏమంటారో!

మరింత సమాచారం తెలుసుకోండి: