స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కూడా దాడికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సిద్దమవుతోంది.తమకు తగు అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన పై అసంతృప్తిగా ఉంది.ముఖ్యంగా వాకౌట్ చేస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా అంటే,వారు అందుకు కారణం చెప్పడానికి వీలుగా మైక్ ఇస్తుంటారు.కాని కోడెల ఎందువల్లనో కాని ఇవ్వలేదు.దాంతో విపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దానికి కొనసాగింపుగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్ పై ఏ ఏ విమర్శలు చేసిందో రికార్డులు వెలికి తీస్తున్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గతంలో స్పీకర లను దారుణంగా దూషించేవారని చెబుతూ ,అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ముషారఫ్ అని విమర్శించడంతో పాటు మరోసారి కొందరు టిడిపి నేతలు స్పీకర్ ను రౌడి అని అన్నారని గుర్తు చేస్తున్నారు.వాటిని గుర్తు చేస్తూ,ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావుగత చరిత్ర ఎలాంటిదో అందరికి తెలుసునని వ్యాఖ్యానిస్తున్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ స్వామి మాట్లాడుతూ కోడెల స్పీకర్ కాక ముందు ఎలా వ్యవహరించారో,ఇప్పుడు స్పీకర్ అయ్యాక కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అది ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: