ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నల్లేరుపై నడకలా ప్రవర్తిస్తుందని రాజసభ్య సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విభజనలో ఏదైతే ప్రకటించారో ఆ ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై విశాఖ వచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మాట్లాడి, వినతి పత్రం ఇచ్చామని సుబ్బరామిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కలసి పనిచేస్తున్నా నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వందరోజుల పరిపాలన ముగిసినా ఇంత వరకు చి ల్లి గవ్వ కూడ మంజూరు చేయలేదని విమర్శించారు. విభజన ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించందని అన్నారు. వారు మద్దతు ఇస్తేనే విభజన సాధ్యమయ్యిందని చెప్పారు. విభజనకు మద్దతు ఇచ్చిన భారతీయ జనతాపార్టీ అధికారంలోనికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని వివరించారు. ఈ విషయంలో రాజ్యసభ సభ్యుడిగా తన వంతు కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. నిధుల మంజూరు కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకోచ్చారు. విశాఖ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చించగా, ఆయన స్పష్టత ఇచ్చారని చెప్పారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే నిధులు ఏలా మంజూరు చేస్తామని, అలాగే ఏపీ ప్రభుత్వం తనకు ఎటువంటి లేఖగాని, ప్రతిపాదనలుగాని ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఏపీ రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. హైదరాబాద్‌లా కావాలంటే విశాఖకే ఆ స్థానం ఉందని చెప్పారు. విశాఖను రాజధాని చేస్తే పదేళ్లలో హైదరాబాదుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని పెడితే అభివృద్ధి త్వరగా జరగదని తెలియజేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో విశాఖ లో కేన్సర్‌ ఆసుప త్రి ఏర్పాటు చేయాలని తను పట్టు బట్టి మరి రూ.400 కోట్లు విడుదలు చేయించమన్నారు. ప్రస్తుతం ఈ కేన్సర్‌ ఆసు ప త్రి పనులు ప్రాథమిక దశలో ఉన్నాయన్నారు. ఈ ఆసుప త్రికి ప్రధాన మంత్రి విశాఖ వచ్చి శంకుస్ధాపన చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: