తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయంలో శిధిలావస్థలో ఉన్న సైఫాబాద్ ప్యాలస్ ను తన ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకోనున్నారని విశ్వాసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే దాదాపు దశాబ్ద కాలంగా ప్రభుత్వం ఆ భవనంలో ఏ కార్యాలయాలను ఏర్పాటు చెయ్యలేదు. కాగా ఇప్పటికే శిధిలావస్థకు చేరుకున్న ఆ భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ఇంతకాలం అటువైపు వెళ్ళే వాహనదారులు, ఉద్యోగులు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ వస్తున్నారు. ఇక 2008వ సంవత్సరంలో ఆ భవనం మరమ్మత్తుకు అంచనా వేసిన అధికారులు 8కోట్ల వ్యయం అవుతుందని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు కెసిఆర్ ఆ భవనాన్ని సీఎం కార్యాలయంగా ఉపయోగించుకోవాలనుకోవడంతో దానికి అయ్యే మరమ్మత్తు ఖర్చు సుమారు 20కోట్లు అవుతుందని అధికారులు ప్రాధమిక అంచనా వేస్తున్నారు. అయితే మొదటి నుండి నిజాం కాలం నాటి సంస్కృతికి పెద్దపీట వేస్తున్న కెసిఆర్ ఇటీవల స్వాతంత్ర్య సంబరాలను గోల్కొండ కోటలో ఏర్పాటు చేసారు. అలాగే మెట్రో రైలు మార్గాన్ని కూడా సుల్తాన్ బజార్, మొజంజాహి మార్కెట్ లోని చారిత్రిక కట్టడాలు పాడవకుండా మార్పు చేసారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో 1914-15 సంవత్సరాలలో నిర్మితమైన ప్రాచీన సైఫాబాద్ ప్యాలస్ లో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుండి పాలన సాగించాలని నిర్ణయించారు. మరి ఇవన్నీ చూస్తుంటే నిజాం నవాబుల పాలనపై కెసిఆర్ కు మక్కువ ఎక్కువేనని అనిపించక మానదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: