రుణమాఫీ వ్యవహారం గురించి ప్రతిపక్షం వాళ్ల సంగతి ఎలా ఉన్నా... అధికార పక్షంలోనే ఇప్పుడు ఈ వ్యవహారం గురించి చర్చ జరుగుతోందని సమాచారం. చాలా ఎ క్కువమందిని ప్రభావితం చేస్తున్న ఈ అంశం గురించి ఏదో ఒకటి తేల్చాలని బాబును తెలుగుదేశం నేతలు కోరుతున్నారట. జనాల్లోకి వెళ్లాలంలే భయంగా ఉందని... వీలైనంత త్వరగా ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారట. ఒకవైపు రుణమాపీ అయిపోయిందని మనం జనాలకు చెబుతున్నామని.. అయితే బ్యాంకులు కొత్త రుణాలను ఇచ్చే వరకూ మాఫీ జరిగిందని రైతులు నమ్మే పరిస్థితి లేదని తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు స్పష్టం చేస్తున్నారట. బడ్జెట్ లో కూడా పెద్దగా కేటాయింపులే ఏమీ జరపకపోవడంతో ప్రజల్లో రుణమాఫీపై నమ్మకం సడలుతోందని తెలుగుదేశం నేతలు బాబు కు వివరించినట్టు భోగట్టా. ఇప్పటికే రుణమాఫీ మీద ఆశలతో రైతులు పంటల బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. రుణమాఫీ పై ఆశలు పెట్టుకోకుండా... రుణాలను రెన్యువల్ చేసి ఉంటే... వాళ్లకు బీమా అయినా దక్కేది. అయితే రెన్యువల్ లు చేయకపోవడంతో రైతులకు పంటల భీమా లేకుండా పోయిందని.. ఇప్పుడు రైతులది దిక్కుతోచని స్థితేనని చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు స్పష్టత ఇచ్చారట. ఆలస్యం అయ్యే కొద్దీ రైతుల్లో వ్యతిరేకత పెరుగుతుందని... ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని వాళ్లు విశదీకరించారని సమాచారం. మరి రైతులకు రుణమాఫీ జరుగుతుందని హామీ ఇవ్వండని చంద్రబాబు స్పష్టం చేశారట. ఎక్కడా వెనక్కు తగ్గవద్దని.. కచ్చితంగా మాఫీ జరుగుతుందని చెప్పండని బాబు టీడీపీ నేతలకు చెప్పారట. మరి బాబు గారు ఈ విషయం గురించి ఏం తేలుస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి: