ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్ శాసనసభ్యుడిగా మంత్రి పదవిని చేపట్టిన ఆయన ఈ పదవిలో పెద్దగా ఎంజాయ్ మెంట్ లేదన్నట్టుగా మాట్లాడారు. ఒకవైపు ఐటీ శాఖ మంత్రి.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి వీధినీ ఐటీ హబ్ గా మార్చేస్తామని చెప్పుకొస్తున్న ఆయన ఇదే సమయంలో అధికారంలో ఉన్నప్పటి కంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బావుండేది అని అంటున్నాడు. ఐటీ లో అద్భుతాలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తూ వార్తల్లోకి వచ్చే ఈ మంత్రిగారు ఇప్పుడు రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని తెగ బాధపడుతున్నారు. అధికారం చేతిలో ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు డీడీలు చెల్లించి ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. దీనిపై సమాధానం చెప్పే పరిస్థితి లేక గ్రామాల్లోకి వె ళ్లాలంటేనే ఇబ్బందిగా మారిందని పల్లె అంటున్నారు. మరి రైతులకు కనీస అవసరాలను తీర్చలేకపోతున్నామని మంత్రిగారు ఒప్పుకొంటున్నారు. అధికారంలోకి వచ్చి కూడా తాము సాధించగలిగింది ఏమీ లేకుండాపోతోందని ఆయన ఆవేదన భరితంగా చెప్పుకొస్తున్నారు. అయితే ఇదే మంత్రిగారు... ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా మీడియా ముందుకు వచ్చారంటే.. ఊగిపోతారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారు! మరి వీటిలో ఏది నిజం? రైతుల విషయంలో తాము ఫెయిలవుతున్నామని అంటున్న మంత్రిగారు ఐటీ విషయంలో మాత్రం ఎలా భూతల స్వర్గం చూపిస్తున్నారు! పరస్పరం భిన్నమైన కథ ఇది!

మరింత సమాచారం తెలుసుకోండి: