ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గత ప్రభుత్వాలపై బురద చల్లుతున్నదని విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరోపించారు. రైతులు, డ్వాక్రా, చేనేత రుణాలు మాపీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రభుత్వం, ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనల్లో కేటాయింపులే లేవని జగన్ సోమవారం బడ్జెట్‌పై జగన్ చర్చను ప్రారంభిస్తూ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులపై పూర్తి అవగాహనతో్నే హామీలిచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని పేర్కొన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో పెద్ద మార్పేమీ లేదన్నారు.బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు కూడా సరిగ్గా చూపలేక పోయారని చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేటాయింపులు వాస్తవానికి దూరంగా ఉన్నాయని జగన్ ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం 23 శాతంగా చూపారన్నారు.  రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి అప్పులు పెరిగి పోయి ఆదాయం తగ్గిందన్నారు. తాము ప్రజలను మోసం చేసేందుకు ఇష్టం లేకపోవడంతోనే రుణ మాఫీ చేస్తామని హామీనివ్వలేదని జగన్ చెప్పారు. జాతీయ పార్టీగా ఎదిగినందునే రెండు రాష్ట్రాల వారీగా వేర్వేరు మేనిఫెస్టోలు ప్రకటించామని జగన్ చెప్పారు. ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు పూర్తిగా మర్చిపోయారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని అధికార పక్షం సభ్యులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సీనియర్ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర కుమార్ తదితరులు అడ్డుపడేందుకు ప్రయత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: