రుణమాఫీ పై,రుణాల రీషెడ్యూల్పై రిజర్వు బ్యాంకు మరోసారి తన అబిప్రాయాన్ని స్పష్టం చేసింది.ఇప్పటికే ఎపిలో 120 మండలాలలో చేసిన రుణాల రీషెడ్యూల్ మినహా మరే సదుపాయం ఇవ్వజాలమని రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఇక సొంత వనరులపైనే ఆధారపడవలసిన పరిస్తితి ఏర్పడింది.ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముంబైలో రిజర్వు బ్యాంకు గవర్నర్ తో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.రాష్ట్రాల రుణమాఫీ పధకాలకు తాము సహకరించజాలమని ఆర్బిఐ గవర్నర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ పైదీని ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.రుణాల రీషెడ్యూల్ కోసం ప్రభుత్వం పలుమార్లు రిజర్వు బ్యాంకుకు లేఖలు రాయడం,రాయబారం చేయడం వంటివాటి నేపధ్యంలో గవర్నర్ స్పష్టీకరణకు ప్రాధాన్యం ఏర్పడింది.అయినా ప్రభుత్వం మళ్లీ లేఖ రాస్తుందా?మరేమి చేస్తుందో చూడాలి.కాగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు బాండ్లకు బదులు ప్రామిసరి నోట్లు ఇవ్వాలని తాజాగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.రెండు మూడు ఏళ్లలోవడ్డీతో సహా చెల్లించే విధంగా ప్రభుత్వం రైతులకు నోట్లు ఇస్తుందని, బాండ్లకు బదులుగా ఈ పద్దతి బెటర్ అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు మరో కధనం

మరింత సమాచారం తెలుసుకోండి: