మెదక్‌ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో బిజీబిజీగా చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ ముఖ్యులు సమావేశమయ్యారు. పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో పాటు మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్‌ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకు లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెదక్‌ ఉప ఎన్నికపై గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న దీన్ని అంతా అషామాషీగా తీసుకోవద్దని కేసీఆర్‌ సూచించారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టే లక్ష్యంగా ఎన్నికల్లో పనిచేయాలని తెలిపారు. మెదక్‌ ఉప ఎన్నిక కు సంబంధించిన ఈ సందర్భంగా కేసీఆర్‌ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. మెదక్‌ ఎం పి గెలుపు బాధ్యతను పూర్తిగా మంత్రి హరీష్‌రావుకు అప్పగించినట్లు సమాచారం. ఎం పి స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని బాధ్యతలు అప్పగించారు.  ఇందులో గజ్వేల్‌ నియోజకవర్గానికి పద్మారావు, దుబ్బాక నియోజకవర్గానిక పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంగారెడ్డి, పటాన్‌చెరువు నియోజ కవర్గాలకు ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్‌ఆలీలతో పాటు సిద్దిపేట, మె దక్‌ నియోజకవర్గాలకు హరీష్‌రావుకు. నర్సాపూర్‌ నియోజకవర్గానికి జోగు రామన్నకు బాధ్యతలు అప్పగించారు. మెదక్‌ ఉప ఎన్నిక ను ంచి బరిలో నిలిచేందుకు ఆరుగురి పే ర్లు పరిశీనలకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో టీఏన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌, ప్రము ఖ రియాల్టర్‌ ప్రవీణ్‌రెడ్డి, సోని మోటార్స్‌ అధినేత కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, తెరాస అధికార ప్రతినిధి రాజయ్య యా దవ్‌ల పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. రేపు మరోసారి సమావేశం కావాలని కేసీఆ ర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేడు నిర్వహించే సమావేశంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ పలువురిని సమావేశమయ్యారు. సీఎం అయిన తర్వాత కేసీఆర్‌ భవన్‌కు రావ డం ఇది రెండవసారి కావడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మెదక్‌ ఉప ఎన్ని కకు సంబంధించిన కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షాలను అంత సులువుగా అంచనా వేయవద్దని అన్నారు. గెలుపుపై ధీమా వున్న తమదైన శైలిలో పార్టీ అభ్యర్థిని గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది పార్టీకే కాకు ండా ప్రభుత్వ ప్రతిష్టతకు సంబంధించిన అంశమన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గె లుపుకే ప్రాధాన్యమివ్వకుండా గతంలో వచ్చిన మెజార్టీ కంటే మరింత ఎక్కువ మెజార్టీ కోసం చొరవ చూపాలని అన్నారు. సింగపూర్‌ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ కు చేరుకున్న కేసీఆర్‌ మొదటి అంశంగా మెదక్‌ ఉప ఎన్నిక అంశంపై తీవ్రస్థాయిలో పా ర్టీ నేతలు మంతనాలు సాగించారు. మెదక్‌ ఎన్నికపై ప్రతిపక్షాలు సైతం అనేకమైన వ్యూ హాప్రతివ్యూహాలను అనుసరించే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిల్లో నూ ఈ ఎన్నికను లైట్‌గా తీసుకోవద్దని కేసీఆర్‌ హితవు పలికారు

మరింత సమాచారం తెలుసుకోండి: