రాష్ట్ర అభివృద్ధికి మంచి పాలనను నిర్ధారించేందుకు పారామితులు ఉంటాయని, అందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలు ఆధారం అవుతాయని, అంతే తప్ప ఈనాడు పేపర్ కాదని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నాడు శాసనసభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ, తమకు అనుకూలమైన విధంగా ఈనాడు పత్రికలో అధికారపక్షం రాయించుకుందని అన్నారు. దానిని ఎద్దేవా చేస్తూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్ అంటే సాక్షి పేపర్ కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వం వైట్‌పేపర్ల పేరిట ఎల్లో పేపర్లను విడుదల చేసిందని వైఎస్ జగన్ తిప్పికొట్టారు. కాగా, వేడి వాతావరణం శాసనసభలో కనిపిస్తోందని, ఎపుడూ నవ్వుతూ కనిపించే స్పీకర్ ఇటువైపు నవ్వుముఖంతో కనిపించడమే లేదని వైఎస్‌ఆర్‌సిపి నేత నాగిరెడ్డి అన్నారు. ఇంత రాజకీయవేడి వాతావరణంలో మున్ముందు సభ నడవడమే క్లిష్టం అవుతుందని అన్నారు. గతంలోనూ ఇంత కంటే వేడివేడి చర్చలు జరిగినా, సభలో అధికార విపక్షాల మధ్య వాతావరణం ఎన్నడూ చెడిపోలేదని, ఒక మంచి వాతావరణం తీసుకురావల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని నాగిరెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: