సాధారణంగా తెలుగుదేశం అధినేత ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడంపై పెద్ద హడావుడే జరగాల్సింది. బాబు-మోడీల ను సూపర్ హిట్ పెయిర్ గా చెప్పే మీడియా కూడా ఈ మీటింగ్ ని ఒక రేంజ్ లో హైలెట్ చేయాల్సింది. అయితే బాబు తాజా ఢిల్లీ పర్యటనపై అలాంటి పరిస్థితి కనపడటం లేదు! మోడీ కి, బాబుకి మంచి సాన్నిహిత్యం ఉందని.. ఆ సాన్నిహిత్యం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి బాగా ఉపయోగపడుతోందని... ఈ రెండు పార్టీలూ అధికారంలోకి రావడం, ఈ నేతలు ఇద్దరూ కలిసి పనిచేయడం మన అదృష్టం అనే ప్రచారం చాలా గట్టిగా జరగాల్సింది. ఇప్పటికే నరేంద్రమోడీ విషయంలో హైప్స్ ను తీవ్రంగా పెంచేయడంలో తెలుగుమీడియా పాత్ర కూడా చాలా ఎక్కువగా నే ఉంది. అయితే బాబు, మోడీల సమావేశం సమయంలో మాత్రం అలాంటి ప్రయత్నాలు అంతగాజరగడం లేదు. మోడీ ప్రకటనను కూడా యథావిధిగా మాత్రమే చెబుతోంది మన మీడియా. విభజన బిల్లు లో ఏ హామీలు అయితే పేర్కొన్నారో..వాటన్నింటినీ అమలు చేస్తామని మోడీ స్పష్టం చేసినట్టుగా తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ప్రత్యేకంగా విభజన బిల్లును ప్రస్తావిస్తూ.. అందులోని హామీలను నెరవేరుస్తాం అని అంటున్నారంటే.. ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలోన్నో ఉన్నాయి! ఎందుకంటే.. విభజన బిల్లులో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏం పేర్కోలేదు! ఇప్పుడు మోడీ జీ విభజన ప్యాకేజీలోని హామీలను మాత్రమే అంటున్నారంటే... ప్యాకేజీ ఏమీ లేదని క్లారిటీ ఇచ్చినట్టేనా?! ఇంకాస్త లేటుగా ఏమైనా ప్రకటిస్తారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: