ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సంవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరారు. అలాగే ప్రధాని మోడీతో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీడర్ వైఎస్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు, మోడీ సమావేశంలో రాష్ట్ర రాజధాని అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలిపారు.ే  అలాగ పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు విదేశీ పర్యటనలను చేస్తానని మోడీకి చెప్పారని వివరించారు. ఇక ఆటోమొబైల్ వంటి కీలమైన రంగాలలో పెట్టుబడుల కోసం నవంబర్ లో చంద్రబాబు జపాన్ వెళ్లనున్నట్లు మోడీకి తెలిపారని చౌదరి పేర్కొన్నారు. అటుపై చైనా, సింగపూర్, మలేసియా, సౌత్ కొరియా దేశాలను కూడా చంద్రబాబు పర్యటించనున్నారని చౌదరి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: