ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ కూడా వెళ్ళడం వివాదాస్పదం కాగా, ఈ అంశంపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు. భార్య, గాళ్ ఫ్రెండ్ సమక్షంలో సరిగా ఆడలేరన్న వాదన మూర్ఖత్వం అని సైఫ్ కొట్టిపారేశాడు. మ్యాచ్ కు ముందు రోజు రాత్రి సెక్స్ లో పాల్గొంటే మైదానంలో మెరుగైన ప్రదర్శన కనబర్చలేరనడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించకూడదని ఈ నవాబ్ ఆఫ్ పటౌడీ సూచించాడు. లాంగ్ టూర్లకు ఎవరో ఒకరి తోడు ఉండాల్సిందేనని అన్నాడు.  కాగా, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ విజేతకు సైఫ్ తండ్రి, మాజీ కెప్టెన్ పటౌడీ పేరుమీదే ట్రోఫీ ప్రదానం చేస్తారు. చివరి టెస్టు అనంతరం ఈ ట్రోఫీ అందించాలని ఈసీబీ ప్లాన్ చేసినా, ఓవల్ లో జరిగిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అయితే, సైఫ్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. తండ్రి పేరిట ట్రోఫీ ప్రదానం చేసే కార్యక్రమానికి వెళ్ళలేకపోవడం నిరాశకలిగించిందని తెలిపాడు. ఇక, సిరీస్ ఫలితంపైనా సైఫ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. గెలుపోటములు సహజమని, టీమిండియాను తీవ్రంగా విమర్శించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: