తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన మంత్రివర్గం పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినప్పటికీ మంత్రులు మాత్రంఇంకా ఆయా శాఖలపై అవగాహనను తెచ్చుకోలేకపోయారని కెసిఆర్ మండిపడుతున్నారని సమాచారం. అలాగే మంత్రుల పేషీలు కూడా అధ్వానంగానే ఉన్నాయని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక మంత్రుల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై కూడా కెసిఆర్ కు అనేక అభ్యంతరాలు అందుతున్నట్లు సమీప వర్గాలు పేర్కొంటున్నాయి.  ఇక దీనిపై తీవ్ర అసంతృప్తిని చెందిన కెసిఆర్ తన క్యాబినెట్ లో పెను మార్పులు చేసేందుకు సంకల్పించారని వినికిడి. అలాగే దసరా లోపు కొందరు మంత్రులను బయటకు పంపడమో లేదా వారికి కేటాయించిన శాఖలను మార్చడమో చెయ్యబోతున్నారని రాజకీయ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. ఇక ప్రజల విశ్వాసం పొందాలంటే మంత్రుల పనితీరు మెరుగుపడాలని భావించిన కెసిఆర్ తన మంత్రివర్గంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: