కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగా ఫీలవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తమను గుర్తించడం లేదని.. తమకు సరైన గౌరవం అందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఫీలవుతుంది. అందుకే తాము నందిగామ అసెంబ్లీ ఉ ప ఎన్నికల్లో పోటీ చేయడానికే నిర్ణయించుకొన్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇంతకీ విషయం ఏమిటంటే... నందిగామ ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తమ పార్టీ శాసనసభ్యుడు మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అందుకని.. ఆయన కూతరును ఎమ్మల్యేగా గెలిపించుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది. అందుకోసం ఇతర పక్షాల ను కూడా తెలుగుదేశం పార్టీ సహకరించాలని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తమ అభ్యర్థి పోటీలో ఉండడు అన్నట్టుగా ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ అభ్యర్థి ఖరారయ్యాడు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నందిగామలో తమ అభ్యర్థి ఉంటాడని ప్రకటించాడు. మరి మానవతా దృక్పథాన్ని వదిలి ఇలా పోటీ పెట్టడం ఏమిటి? అంటే.. తమకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని... పోటీ పెట్టవద్దని వాళ్లు కోరలేదని రఘువీరారెడ్డి అంటున్నాడు. అందుకే తమ అభ్యర్థి ని పోటీలో ఉంటాడని ఆయన ప్రకటించాడు. మరి నామినేషన్లు వేసినా.. ఉపసంహరణ గడువులోగా తెలుగుదేశం నేతలు రంగ ప్రవేశం చేసి.. కాంగ్రెస్ అభ్యర్థిని రంగం నుంచి తప్పిస్తారేమో చూడలి!

మరింత సమాచారం తెలుసుకోండి: