ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో జపనీస్ లో పోస్ట్ చేసి అందరిని సర్ప్రైజ్ చేసాడు. మోడీ శనివారం నుండి ఐదు రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నాడు. ఇండియా, జపాన్ ల సంబంధం కాల పరీక్షను తట్టుకొని నిలిచిందని, రెండు డెమోక్రటిక్ దేశాలు ప్రపంచ శాంతి, డెవలప్మెంట్ కోసం చిత్తశుద్ది తో ఉన్నాయని ఒక ట్వీట్ లో అన్నారు. జపాన్ ఆతిధ్యం తనను చాలా ఇంప్రెస్ చేసిందని, మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు, జపాన్ టూర్ కు వెళ్ళిన అనుభవాలను గుర్తు చేస్తూ మరో ట్విట్ చేసాడు. టోక్యో, క్యోటో ల్లో పర్యటించి అక్కడి స్టూడెంట్స్, పొలిటికల్ లీడర్స్, ఇండస్ట్రీయలిస్ట్ లతో సమావేశం కానున్నట్టు మరో ట్విట్ లో అన్నారు. మొత్తం ఎనిమిది ట్విట్ లు చేసిన మోడీ తన లాస్ట్ ట్విట్ లో తనకు జపనీస్ లో పోస్ట్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళకు థాంక్స్ చెప్తూ, కొందరు తనను జపాన్ ప్రజలతో జపనీస్ లో మాట్లాడాలని కోరారని అన్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల లో యాక్టివ్ గా ఉండే మోడికి ట్విట్టర్ 60 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: