తమ అభిమాన హీరో విషయంలో పవన్ ఫ్యాన్స్ చూపించే అభిమానం పీక్ స్టేజికి చేరింది. తమ హీరో కరెన్సీ నోటు మీద ఉండదగిన స్థాయి వ్యక్తి అని వారు భావిస్తున్నారు. అందుకే మార్ఫింగ్ చేసి కరెన్సీ మీద గాంధీ మహాత్ముడి చిత్రాన్ని తొలగించి... తమ హీరో ఫోను ముద్రించుకొన్నారు. దాన్ని తమకు పరిమితం చేసుకోకుండా ఫేస్ బుక్ కు కూడా ఎక్కించారు. దీంతో ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కోకతప్పని పరిస్థితి ఏర్పడింది. 50 రూపాయల నోటు మీద గాంధీ చిత్రం స్థానంలో పవన్ కల్యాణ్ బొమ్మను పెట్టి మార్ఫింగ్ చేసి దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వ్యక్తులపై కొంతమంది న్యాయవాదులు ఎల్బీ నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది జాతీయ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ ఫేస్ బుక్ యూజర్లు ఇబ్బంది ఎదుర్కోకొంటారేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ హీరో ఒక 60 సంవత్సరాలకు ముందు పుట్టి ఉంటే.. గాంధీ స్థానంలో ఆయన ఉండే వాడని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయం. మరీ వెర్రి పీక్ స్టేజ్ కి చేరినప్పుడు మాత్రమే ఇలా అనిపిస్తుందేమో అనే సెటైర్లు పడుతున్నా... పవన్ కల్యాణ్ గాంధీ కన్నా ముందు పుట్టి ఉంటే.. గాంధీకి జాతిపిత అయ్యే అవకాశాన్ని ఇచ్చేవాడే కాదని పవనిజం ఫ్యాన్స్ అంటున్నారు. ఫోటో షాప్ టెక్నిక్స్ ద్వారా తమ అభిప్రాయాలను వైరల్ గా తీసుకెళ్తున్నారు. మరి గాంధీతో ఆటలు కదా... చట్టం ఎలా స్పందిస్తుందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: