తెలంగాణలో పరిపాలనకు జ్వరం వచ్చిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. పిహెచ్‌సిల్లో కరెంట్ కట్ చేయడం వల్ల రోగులకు చీకట్లోనే వైద్యం చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు మాట్లాడితే తెలంగాణ ద్రోహులు అంటున్నారని ఆయన అన్నారు. స్నేక్ గ్యాంగ్‌కు మజ్లిస్ అండ ఉందని, వారికి బతికే అర్హత లేదని, ఉరిశిక్ష వేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన పథకం చాలా అద్భుతమైనదని అన్నారు. ఆ పథకంలో భాగంగా ఖాతా ప్రారంభించిన వారికి ఆరు నెలల అనంతరం ఖాతా నుండి 5వేలు రుణం పొందవచ్చని అన్నారు. 5 వేలు రుణం తీర్చిన తర్వాత 15వేల రూపాయిలు రుణం లభిస్తుందని, రెండు లక్షల వరకూ ప్రమాద బీమా కూడా ఉంటుందని అన్నారు. బ్యాంకు అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించి పథకం విజయవంతం అయ్యేవిధంగా కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు పట్టడం లేదని డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యల కంటే మెదక్ ఉప ఎన్నికే టిఆర్‌ఎస్ నాయకులకు ప్రధానం అయిపోయాయని విమర్శించారు. ఒక వైపు పంటలు ఎండిపోతున్నా దాని గురించి ఆ పార్టీకి పట్టడం లేదని, చత్తీస్‌ఘడ్ నుండి కరెంట్ తెచ్చి ఇస్తామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి నేడు వౌనం వహించారని, ఆయన సొంత జిల్లాలోనే రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: