అసెంబ్లీ సమావేశాలంటే.. చర్చలన్న సంగతి ఏనాడో మరచిపోయారు ప్రజాప్రతినిధులు.. అరుపులు పెడబొబ్బలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, తిట్లు, దుమ్మెత్తిపోసుకోవడం ఇదే పరిస్థి. గతంలో రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడూ అంతే.. ఇప్పుడు రెండుగా డివైడ్ అయ్యాకా అంతే. ఈ సంగతిని ఇప్పటికే ఆంధ్ర ఎమ్మెల్యేలు మరోసారి ప్రూవ్ చేశారు. సభలో చర్చకంటే రచ్చ ఎక్కువైందన్న సంగతి అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం ఒక్క అసెంబ్లీనే రెండు రాష్ట్రాలు వాడుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్రా కుమ్ములాట నడుస్తోంది. తెలంగాణ ఫైటింగ్ కొన్నాళ్లు వాయిదా పడింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ పదో తేదీ నుంచి నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఆ మధ్య సుహృద్భావ వాతావరణంలో జరిగిన స్పీకర్ల సమావేశంలో ఈ మేరకు డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణ సమావేశాల కోసం ఏపీ సమావేశాలను 2,3 రోజుల ముందే క్లోజ్ చేయాలని కూడా నిర్ణయించారు. ఐతే లేటెస్ట్ గా ఇప్పుడు.. తెలంగాణ మీటింగ్స్ వాయిదా పడుతున్నాయి. కారణం.. మన ఊరు - మన ప్రణాళిక, టాస్క్ పోర్స్ ల నివేదికల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నాడట. అందువల్ల ప్రతిపాదనల రూపకల్పనకు మరికొంత టైమ్ పడుతుంది కాబట్టి అప్పటివరకూ బడ్జెట్ సమావేశాలు వాయిదా వేశారు. తెలంగాణ సమావేశాలు వాయిదా వేయడంలో ఓ చిన్న చిక్కు ముడి కూడా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ఒకవేళ సమావేశాలు ఆలస్యమైతే అక్టోబర్ లో లావాదేవీల కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రభుత్వం దృష్టి సారించక తప్పదు. అందుకే .. కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ తో ఈ అంశంపై ఇప్పటికే చర్చించారట. ఇవన్నీ ఎప్పుడో ఓ సారి జరిగే రేర్ ఇన్సిడెంట్స్ కాబట్టి.. రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలన్నదానిపై కాస్త క్లారిటీ అవసరం. సమావేశాల వాయిదా కోసం అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని నిపుణలు చెప్తున్నారు. అయితే అంత అవసరం కూడా ఉండదని... నేరుగా ఆదేశాలు ఇవ్వొచ్చని సలహాదార్లు, అధికార్లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తేల్చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: