భారతీయ జీవన వ్యవస్థలో పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. మూడుముళ్ల బంధంతో జంట ఒక్కటయ్యేందుకు.. వివాహబంధం కోరుకునేందుకు ఎన్నో కారణాలున్నా వాటిలో శృంగారమే అన్నింటికంటే ప్రధానమైంది. ఈ విషయం ఎవరూ కాదనలేనిది. ఓ జంటకు పెళ్లి సంబంధం చూసేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. అంత కాకపోయినా.. అన్ని రకాల ఆరాలు తీస్తారు. చదువు, విద్యార్హత, ఉద్యోగం, కుటుంబ చరిత్ర.. ఇలా అన్నీ పరీక్షిస్తారు. కానీ అతి ముఖ్యమైన లైంగక విషయాలపై దృష్టి పెట్టడం భారతీయ సాంప్రదాయంలో లేదు. అన్నీ చక్కగా ఉంటే ఏ గొడవా లేదు. కానీ పెళ్లయిన తొలిరాత్రే.. తన భర్త నపుంసకుడని తెలిస్తే.. మొదటి రాత్రి హుషారుగా పడక గదిలోకి వెళ్లిన కుర్రాడికి.. శృంగారంలో ఏమాత్రం ఆసక్తిలేదని తెలిస్తే.. అంతకు మించిన నరకం ఏమైనా ఉంటుందా.. అవును కదా.. మరి పెళ్లికి ముందు అబ్బాయికి లైంగిక పటుత్వం ఉందా లేదా.. అమ్మాయికి శృంగారమంటే ఆసక్తి ఉందా లేదా.. అని పరీక్షించే సాహసం, ఆలోచన ఎంత మంది పెద్దలకు ఉన్నాయి. విద్య, ఆస్తి, ఆరోగ్యం అన్నీ ఉన్నా.. ఈ విషయంలో చాలా మంది ఎందుకు అదృష్టాన్నే నమ్ముకుంటున్నారు.? ఈ పరిస్థితినే సూటిగా నిలదీసింది మద్రాస్ హైకోర్టు మదురై బెంచి. పెళ్లికి ముందు వధూవరులకు నపుంసకత్వం, లైంగిక సామర్థ్యం పరీక్షలు ఎందుకు తప్పనిసరి చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఎంఎస్సీ ఐటీ చదివిని ఓ అమ్మాయికి.. తన భర్త ఆ విషయంలో.. ఎందుకూ పనికిరాడని కొద్దిరోజుల్లోనే తెలిసిపోయింది. పెళ్లైన కొద్ది నెలలకే విడాకులకు అప్లై చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం.. ఆ విషయంలో ఇద్దరిలో ఎవరో ఒకరిలో లోపం ఉండటమేనని తేల్చింది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపింది. అసలు ఈ గొడవ లేకుండా పెళ్లికి ముందు లైంగిక పరీక్షలు తప్పనిసరి చేయవచ్చుకదా.. అని కేంద్రాన్ని ప్రశ్నించింది. నిజమే కదా.. కాదంటారా..

మరింత సమాచారం తెలుసుకోండి: