మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జగరనున్న ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో రాష్ట్ర పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల మధ్య ఐక్యత లేకనే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అపజయం పాలైందనే విమర్శలను ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు మెదక్‌ నియోజకవర్గాన్ని ఃగెలుచుఃకునేందుకు ఃఐక్యంగాః అడుగులు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా ఈ నియోజకవర్గ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బరిలో ఉన్న విషయం విదితమే. ఆమె గెలుపే లక్ష్యంగా టి.పిసిసి ముఖ్య నేతలు ప్రణాళికాపరగా చర్యలను తీసుకోవడంలో నిమగ్న మయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌ అసెంబ్లిస నియోజకవర్గాలలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగించే విషయమై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు మాజీ మంత్రులను, ఇతర సీనియర్‌ నేతలను ఆయా నియోజకవర్గాల ప్రచార బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే నియోజకవర్గాల ఇన్‌చార్జిలుగా ఎవరిని నియమించాలనే విషయమై ఈ సమావేశంలో నేతల మధ్య కొంత తర్జనభర్జన జరిగినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన వారికి అసెంబ్లిస నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనను కొందరు ఈ సమావేశంలో చేసినట్లు సమాచారం. ఓటమిని చవిచూసిన అభ్యర్ధులను ఇన్‌ఛార్జిలుగా నియమించే కంటే మాజీ మంత్రులకు, సీనియర్‌ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించి వారి ఆధర్యంలో ఆయా నియోజకవర్గం లోని పార్టీ నేతలంతా ఐక్యంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిం చాలన్నారు. మెదక్‌ పార్లమెర్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లిస నియోజకవర్గాలు, ఐదు మున్సిపాలిటీలు, 30 మండలాలు, 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అసెంబ్లిస నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి మండలానికి ఒక శాసనసభ్యుడిని, అసెంబ్లిస నియోజకవర్గానికి మాజీ మంత్రిని ఎంపీ, మాజీ ఎంపీలతో కూడిన జట్టును ఏర్పాటుచేసి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతను మాజీ మంత్రులకు అప్పగించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. గజ్వేల్‌ అసెంబ్లిస నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను మాజీ మంత్రి గీతారెడ్డికి అప్పగించినట్లు మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలీ, పార్టీ కార్యదర్శి నర్సింహారెడ్డి చెప్పారు. గతంలో ఈ అసెంబ్లిస నియోజకవర్గ స్థానం నుంచి గీతారెడ్డి పలుమార్లు విజయం సాధిచిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు వంశీ చంద్‌రెడ్డితోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఃజట్టుగాః ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నట్లు వెల్లడించారు. దుబ్బాక అసెంబ్లిస నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ముత్యంరెడ్డి వ్యవహరించనున్నారని ఆయనతోపాటు కృష్ణారెడ్డి తదితరులు పాలుపంచుకోనున్నారు. మెదక్‌ అసెంబ్లిస నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి డికె అరుణ, సంగారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు, పటాన్‌చెరు అసెంబ్లిస బాధ్యతలను నందీశ్వర్‌గౌడ్‌కి అప్పగించారు. సిద్ధిపేట నియోజకవర్గ బాధ్యతలను మాజీమంత్రి శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలకు అప్పగించారు. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు భాస్కర్‌రావు, కుసుమకుమార్‌, రాంమోహన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లుకూడా ప్రచారం చేస్తారని షబ్బీర్‌ అలీ తెలిపారు. నర్సాపూర్‌ అసెంబ్లిస బాధ్యతను అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి చూస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీకి చెందిన 20 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. మెదక్‌ ఉపఎన్నిక నేపధ్యంలో గాంధీభవన్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేయనున్నారు. ఎన్నికల సామాగ్రిని ఇక్కడ నుంచే నియోజకవర్గానికి పంపాలని నిర్ణయించారు. ఇది ఇలా ఉండగా అసెంబ్లిస నియోజకవర్గ ఇంచార్జిలు ఆయా నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులతో ముందుగా సమావేశాలను నిర్వహించనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి అసెంబ్లిస ఇన్‌చార్జిలు రంగంలోకి దిగనున్నారు. గాంధీభవన్‌లో సమావేశంలో దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, డికె అరుణ, షబ్బీర్‌ అలీ, ఆకుల లలిత తదితరుల పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: