రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోని గ్రూపులపై ఆ పార్టీ హైకమాండ్‌ ప్రత్యేక దృష్టిసారించింది. మెదక్‌లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్‌ అధినాయకత్వం ఈ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీలోని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి సమన్వయ లోపమే ప్రధాన కారణమని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని కొందరు టి కాంగ్రెస్‌నేతలు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్‌లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలంటే పార్టీలోని గ్రూపులను నియంత్రించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్వయంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ టి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సిఎ ల్‌పి నేత కె.జానారెడ్డి, టి పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శాసన మండలి కాంగ్రెస్‌ పక్షనేత డి.శ్రీనివాస్‌తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మా, సీనియర్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి, ముత్యంరెడ్డితోపాటు మెదక్‌లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి ఫోన్‌ చేశారు.ఈ మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలను పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐక్యంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం బాధ్య త ప్రతి ఒక్కరూ తీసుకోవాలని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యం ------------- మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రతిష్టాత్మకంగా తీసు కొంటోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యతను కాంగ్రెస్‌ నాయకత్వం పార్టీ నేతలందరిపై మోపుతోంది. తద్వారా గ్రూపులకు చెక్‌పెట్టి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యత ఎవరూ చేపట్టలేదని ఆ కారణంగానే పార్టీ ఓడిందన్న అంచనాకు పార్టీ హైక మాండ్‌ వచ్చినట్లు సమాచారం. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే వారికి పార్టీ గెలుపు బాధ్యత అప్పగించాలని, అప్పుడే వారు చిత్తశుద్ధితో పనిచే స్తారని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ గ్రూపులపై ప్రత్యేక దృష్టిసారించిన పార్టీ నాయకత్వం టి కాంగ్రెస్‌పార్టీకి చెంది న సీనియర్లందరితో తరచూ సంప్రదింపులు, వారిపై బాధ్యతలు మోపాలని నిర్ణ యం తీసుకొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల టి కాంగ్రెస్‌ పార్టీ భవి ష్యత్‌ కార్యాచరణ సదస్సు ముగ్గింపు సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ సైతం మెదక్‌లోక్‌సభ ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకొ చ్చారు. ఈ ఎన్నికల బాధ్యతను పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డితోపాటు ఇతర సీ నియర్లకు అప్పగిస్తున్నట్లు బాహాటంగా ప్రకటించారు. తద్వారా పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి విభేదాలు విస్మరించాలన్న స్పష్టమైన సంకేతాలను ఆయన ఇచ్చారు. ఇలా కాంగ్రెస్‌ హైకమాండ్‌ టి కాంగ్రెస్‌లోని గ్రూపులపై సీరియస్‌గా ఉన్నట్లు ఏఐసిసి నేత ఒకరు పేర్కొన్కానరు. పార్టీలో ఏ స్థాయి నేత అయినా గ్రూపులను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోకూడదని, వాటిని మొదలు దశలోనే అణిచివేయాలని కాంగ్రెస్‌ నాయకత్వంఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్‌ లోక్‌సభ ఎన్నికల వరకు ఏఐసిసి దూతలను పంపే యోచనలో కాంగ్రెస్‌ హైక మాండ్‌ ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు టి కాంగ్రెస్‌ నేతలు స మన్వయంతో పనిచేస్తున్నారాలేదా అని పరిశీలించడంతోపాటు తెలంగాణ రా ష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని బలంగా చెప్పుకొనేలా నేతలను సన్నద్దంచే యడం, పార్టీలోని ప్రతి నేత మెదక్‌లోక్‌సభ ఎన్నికలు జరిగే పరిధిలోని ప్రతి వార్డుకు వెళ్లేలా చేయడం వంటి వాటిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టిసారిస్తున్న ట్లు సమాచారం. ఎప్పటికప్పుడు నివేదికలు? ---------------------------- మెదక్‌లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ నేతల ప్రమేయం ఏమేర ఉంది, ఈ నేత పా ర్టీ ప్రచార పర్వంలో ఉన్నారు, ఎవరూ అంటిముటన్నట్లు ఉన్నారు అన్న దానిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిసింది. దీనిపై తనకున్న వేగుల ద్వారా అంతర్గత నివేదికలు తెప్పించుకొనే విషయంలోనూ కాంగ్రెస్‌ అధిష్ఠానం తలమునకలైనట్లు సమాచారం. ఈ నివేదికల ద్వారా మున్ముందు పార్టీలోని నేతల భవిష్యత్‌ను నిర్ణయించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: