ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో స్థానాన్ని ఆస్ట్రేలియా కొల్పోయి చాలా కాలమే అయ్యింది. గతంలో ఎప్పుడు చూసినా ఆస్ట్రేలియానే టాప్ ప్లేస్ లో ఉండేది. కానీ 2011 వరల్డ్ కప్ తర్వాత ఇండియా టీం టాప్ ప్లేస్ లొనే కంటిన్యూ అవుతొంది. దీంతో రానున్న వరల్డ్ కప్ ఎవరూ నెం.1 అనే విషయాన్ని తేలుస్తుందని ఆస్ట్రేలియా కెప్టెన్ క్లర్క్ అన్నారు. రేసులో ఎవరు నిలుస్తారో బిగ్ ఫైట్ డిసైడ్ చేస్తుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో వరల్డ్ కప్ జరగనుంది. అక్కడే అసలైన ఛాంపియన్ ఎవరో తేలుతుందన్నారు. ఆరు నెలల్లో అసలైన టీం ఏది అనే విషయం బయటకొస్తుందని క్లర్క్ చెప్పాడు. గతంలో మా టీం 1987, 1999, 2003,2007 వరల్డ్ కప్ లను గెలుచుకుందన్నారు. వచ్చే టోర్నమెంట్ లో మా టీం హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: