మెదక్ భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి జగ్గారెడ్డిపై కేసు ఉందని చెప్పి భయపెట్టడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి శాసనసభ పక్ష ఉప నేత ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్ విమర్శించారు. జగ్గారెడ్డిపై పెండింగులో ఉన్న వివిద కేసులను పోలీసులు పరిశీలిస్తున్న నేపధ్యంలో ఆయన కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేసుల పేరుతో భయపెట్టలేరని, బిజెపి కార్యకర్తలు ఇలాంటి కేసులకు భయపడరని వ్యాఖ్యానించారు.తెలంగాణలో అనేక సమస్యలు పెరిగిపోతున్నాయని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ప్రభాకర్ అన్నారు.తెలంగాణ లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని, అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని అన్నారు.మాసాయి పేట ఘటన జరిగితే అక్కడకు కెసిఆర్ వెళ్లలేకపోయారని, ఇళ్ల కూల్చివేత, ఒప్పంద కార్మికుల నిర్మాణం వంటి అంశాలపై కెసిఆర్ జనంలోకి వెళ్లగలరా అని ప్రభాకర్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: