రైతులు, మహిళా సంఘాలకు ఎన్నిక ల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం రుణాల్ని మాఫీ చేసి తీరాల్సిందేనని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిం ది. లేనిపక్షంలో ఇకముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు తప్పవంటూ అల్టిమేటం జారీ చేసింది. రుణమాఫీ హామీతోనే రైతులు, మహిళలు చంద్రబాబుకు ఓట్లే శారని, ఇప్పుడదే హామీని తుంగలో తొక్కితే జనం నుంచి తిరుగుబాటు ఎదుర్కోక తప్పదంటూ కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి హెచ్చరించారు. ఈ తిరుగు బాటుకు కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్‌ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. దీనికి అనూహ్య సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమా వేశంలో పార్టీ రాష్ట్రస్థాయి నేతలంతా పాల్గొన్నారు. సీమాంధ్ర లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసే లక్ష్యంతోనే ఇలాంటి సమావే శాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేసినప్పటికీ మాఫీ విధానాలపై స్పష్టత ఇవ్వడంలేదన్నారు. మొత్తం వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్లున్నాయని తెలిపారు. కోటయ్య కమిటీని నియ మించి మొత్తం రుణమాఫీ సాధ్యం కాదంటూ చంద్రబాబు చెప్పించారన్నారు. ఇప్పుడు రుణమాఫీని రూ. 40 వేల కోట్లకు కుదించారు. దీన్ని మరింత తగ్గించేందుకు 2013 డిసెంబర్‌ 31ని కటాఫ్‌ డేట్‌ అంటూ కొత్త జీవో తెచ్చారు. దీంతో రుణాల మొత్తం రూ. 30 వేల కోట్లకు దిగిపోయింది. ఈ మొత్తాన్ని కూడా ఎప్పటికి రద్దు చేస్తారో ఖరాకండీగా చెప్పడం లేదు.. రుణాల్ని కాదు.. రుణమాఫీనే మొత్తంగా మాఫీ చేసేందుకు ఇప్పుడు బాబు ప్రయత్నిస్తున్నారంటూ చిరంజీవి దుయ్య బెట్టారు. పైగా ఇందుకు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని సాకుగా చూపుతు న్నారన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర పరిస్థితిపై చంద్రబాబు కు అవగాహన లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కోనసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమానికి దిగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృంతం కానుంది.. పాతరుణాలు మాఫీ చేయరు.. కొత్తవాటిని ఇవ్వరు.. ఇప్పటికే ఖరీఫ్‌ మొద లైంది.. ఎప్పట్లోగా మాఫీ చేస్తారో చెప్పక పోవడంతో నాట్లేసిన రైతులు అయోమయానికి గురవుతున్నారంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఎన్‌డీఏలో చక్రం తానేతిప్పుతానని చంద్రబాబు ఆశించారు.. మోడీ తన జేబులో మని షన్నారు. ఇప్పుడు చూస్తే కేంద్రంలో బాబుకెలాంటి పరపతిలేదని తేలిపో యింది. అక్కడి నుంచి రూపాయి కూడా తేలేక పోతున్నారు. ఆఖరకు యూపీఏ ప్రకటించిన ప్రత్యేక హోదాను కూడా రాష్ట్రానికి సాధించుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. పార్టీ కార్య కర్తలు నిరాశ, నిస్పృహలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నూత నుత్తేజం కనిపిస్తోంది.. అధికారం కోల్పోయినంతమాత్రాన స్థైర్యం కోల్పోవద్దు.. ప్రభుత్వంపై పోరాటానికి ప్రతి కార్యకర్త కార్యోన్ముఖుడు కావాలంటూ చిరంజీవి పిలుపునిచ్చారు. రాజకీయ స్వార్థంతో పార్టీలు మారిన నాయకుల్ని ఆయన తీవ్రంగా దుయ్యబెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: