మెద క్‌ లోక్‌సభ ఉప పోరుకు టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ హోరాహోరి ప్రచార పర్వానికి తెర తీస్తున్నాయి. మూడు పార్టీల వైపు నుంచి బలమైన నేతంతా మెదక్‌ లో క్‌సభ నియోజకవర్గంలో మకాం వే శారు. ఈ ఎన్నికత్లో పార్టీ విజయా న్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నా రని టిఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటు న్నాయి. అంతే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకొంటోంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ఇక ప్రచారం షురూ కానున్నది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో విజయం కోసం టి కాంగ్రెస్‌ నేతను దశదిశ నిర్దేశం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చేస్తున్నారు. ఈ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని మార్గాలను అధికార టిఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీలు అన్వేషిస్తున్నాయి. ప్రచార అంశాలపై కూడా ఇరు పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు టి కాంగ్రెస్‌ సిద్దమవుతుంటే, విభజన బిల్లులోని లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని టార్గెట్‌ చేయడం, కేంద్రంలోని ఎన్‌డిఏ సర్కార్‌ తెలంగాణ రాష్టానికి సహకరించడం లేదంటూ బిజెపిని టార్గెట్‌ చేయడం లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఈ దిశగా అడుగులు వేయాలని సిఎం కెసిఆర్‌ స్వయంగా టిఆర్‌ఎస్‌ నేతలకు దశదిశ నిర్దేశం చేసినట్లు సమాచారం. నేడు రంగంలోకి కాంగ్రెస్‌ మెదక్‌లోక్‌సభ ఉప ఎన్నికల్లో హస్తం గుర్తు జెండాను ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సోమవారం నుంచి పటాన్‌చెరువులో ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పురిధిలోకి వచ్చే నియోజకవర్గాలలో అన్నింట్లలోనూ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం సీనియర్‌ నేతలను కేటాయించి వారి చేత ప్రచారం చేయడానికి నిశ్చయించింది.  ఏఏ నియోజకవర్గంలో ఏఏ సామమాజిక వర్గ ఓటర్లు మెండుగా ఉన్నారు అన్న కోణంలో యోచించి ఆయా నియోజకవర్గాలకు ఆ సామాజిక వర్గాల నేతలనే ప్రచారానికి కాంగ్రెస్‌ నాయకత్వం కేటాయించింది. ఈ ఎన్నికల ప్రచారం ముగిసే వరకు, ఎన్నికలు జరిగే వరకు నిత్యం టి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో ఏఐసిసి పెద్దలు కొందరు సంప్రదింపులు కొనసాగించేలా పార్టీ హైకమాండ్‌ ప్రత్యేక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు తన రాజీనామా ద్వారా ఖాళీ అయిన మెదక్‌లోక్‌సభ సీటును తిరిగి తన పార్టీ ఖాతాలోకి చేరేలా సిఎం కెసిఆర్‌ పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆయన ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ంబాధ్యత అప్పగించడమే కాకుండా పార్టీ సీనియర్లను ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిఎం కెసిఆర్‌ నియమించిన విషయం తెలిసిందే. ఇలా టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమ తమ సీనియర్‌ నేతలను మెదక్‌లోక్‌ సభకు మోహరించారు. దీంతో ఈ రెండు పార్టీల ప్రచారం హోరాహోరిగా సాగడమే కాకుండా ఇరు పార్టీల మధ్య విమర్శల జోరు కూడా పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మిత్రపక్షాల మద్దతుకు యత్నం? ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో ఒంటరిగానే పోరుకు దిగాయి. అయితే సొంతబలంతోపాటు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పార్టీల మద్దతును ఇరు పార్టీలు అంతర్గతంగా కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీలలో లోక్‌సత్తా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో కనిపించకపోయినా ఎంఐఎం, సిపిఐ, సిపిఎం ప్రభావం మాత్రం ఉంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీకి ఎంఐఎం మద్దతు అంతర్గతంగా ఉంటుందని రాజకీయ వర్గాల అంచనా. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో నడిచిన సిపిఐ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ వైపు మొగ్గుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే సిపిఎం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది అన్నది కూడా చర్చాంశనీయమే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్‌ పార్టీ పాటించలేదని సిపిఐ పార్టీ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిపిఐ నాయకత్వం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికే అవకాశం లేదని ఇరు పార్టీల వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి టిడిపి మద్దతుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: