బెజవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దు మొర్రో అంటోది శివరామకృష్ణన్ కమిటీ. ఎందుకయ్యా అంటే.. అక్కడ ప్రభుత్వ భూములు లేవంటోంది. నిజమే అక్కడ ప్రభుత్వ భూములు పెద్గగా లేవు. కానీ వివిధ కారణాలతో చంద్రబాబు అక్కడే రాజధాని పెట్టాలనుకుంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అందుకే.. రైతుల నుంచి భూములు కొనడం కాకుండా డెవలప్ మెంట్ బేసిస్ మీద సేకరించాలని పట్టుదలగా ఉంది. అంటే రైతుల భూములు తీసుకుని డెవలప్ చేసి.. ఆ భూమిని రైతులు, ప్రభుత్వం 60-40 నిష్పత్తిలో పంచుకుంటాయన్నమాట. కానీ ఇది వర్క్ ఔట్ అవుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. వినడానికి బాగానే ఉన్నా రైతులు ఇందుకు అంగీకరిస్తారా అన్నది ప్రధాన సందేహం.. అందుకే ముందు రైతుల్లో భయం పోగొట్టాలని చంద్రబాబు టీమ్ డిసైడయ్యింది. ఎగ్జాంపుల్ గా ఇప్పటికే ఇలాంటి ప్రతిపాదనలో ఉన్న జక్కంపూడి, గొల్లపూడి గ్రామాల నుంచి తీసుకున్న భూములను యుద్ధప్రాతిపదికను రైతులకు అప్పగించింది. దీని కథేమిటంటే.. 2006లో విజయవాడలోని పేదల కోసం 28 వేల ఇళ్లను జెఎన్ఎన్యూఆర్ ఎం పథకం ద్వారా నిర్మించేందుకు భూములు సేకరించాలని వైఎస్ సర్కారు భావించింది. 2008లో భూమి సేకరించి... సన్నకారు రైతులకు 60-40 నిష్పత్తిలో ప్లాట్లను కేటాయించింది. మొత్తం 222 ఎకరాలు సేకరించారు. అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తర్వాత 60: 40 శాతం నిష్పత్తిలో వాటాలుగా చేసి 18 నెలల్లోగా రైతులు, ప్రభుత్వం భూమిని పంచుకోవాలనేది ఆనాటి ఒప్పందం. జెఎన్ఎన్యూఆర్ ఎం గృహ సముదాయ నిర్మాణాలు అరకొరగా పూర్తి చేసినప్పటికీ... భూమిని ఇచ్చిన రైతుల ప్రయోజనాలను అప్పటి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 18 నెలల్లో భూములు అప్పగిస్తామన్న ప్రభుత్వం ఆరేళ్లైనా ఆ పని పూర్తి చేయలేదు. జులై 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడకు వచ్చిన సందర్భంగా బాధిత రైతులు ఆయన్ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన సీఎం రైతులకు మేలు చేసే నిర్ణయాన్ని తక్షణం అమలు పరిచేలా చర్యలు చేప్టటాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం విజయవాడ సిద్ధార్థ అకాడమీలో లాటరీ పద్ధతిలో 165 మంది రైతులకు 706 ప్లాట్లను అందించారు. రైతులనుంచి సేకరించిన 222 ఎకరాల్లో...95ఎకరాలను ప్రభుత్వం తీసుకుని 136 ఎకరాల్లో వారికి ప్లాట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో....రైతులు సానుకూలంగా స్పందించి తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకువస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా భూములు సమస్యను అధిగమించి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్నది బాబు ప్లాన్. మొత్తానికి ఆరేళ్లలో పూర్తికానిది.. బాబు సర్కారు రెండునెలల్లో చేసి చూపించిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: